సిద్దిపేట
సమాజ మార్పు కొసం తన జీవితాంతం కృషి చేసాడని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, తెలంగాణ దళిత బహుజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు దేవి రవిందర్ లు తెలిపారు. అనారోగ్యంతో మరణించిన డిబిఎఫ్ నేత కొదాది రవి అంతక్రియలు మంగళవారం జరిగాయి. ఈ సందర్భంగా శంకర్, రవిందర్ లు మాట్లాడుతూ
కొదాది రవి గత 15 సంవత్సరాలు గా సమాజం కొసం రైతు ఆత్మహత్యల కుటుంబాల కొసం,ఉపాధి హమీ కూలీల కొసం,భూమిలేని కుటుంబాలకు భూమివ్వాలని,ప్రధానమంత్రి ఇచ్చిన పట్టాలకు భూములు చూపించాలనే పాదయాత్రలో పాల్గొని పెదలకొసం చేసిన అనేక పొరాటాల్లో పాల్గొన్న కొదాది రవి అతిచిన్న వయస్సులొనే అనారోగ్యంతో కన్నుముశాడు.
అయన స్వస్థలం పెద్దలింగారెడ్డి పల్లిలో మంగళవారం నాడు అమర్ హై కొదాది రవి… జోహర్ కొదాది రవి, రవి ఆశయాలను కొనాసాగిద్దాం అంటూ నినాదాల మద్య అంతిమయాత్ర పొడువునా నినాదాలు,పాటలతో అంతిమ యాత్ర ముగుసింది.
ఈ నెల 13 వ తేదిన సిద్దిపేట్ లొని టిపిటిఎఫ్ ఆఫీస్ లో రవి సంతాపసభ జరుగనుంది కనుక రవి శ్రేయస్సు కొరే వారందరు పాల్గొనవల్సిందిగా విజ్ఞప్తి
ఈ కార్యక్రమం లో డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు దాసరి ఏగొండ స్వామి, చుంచు రాజేందర్,రాష్ట్ర మహిళ నాయకురాలు లక్ష్మీ,బి.రాజమణి,డిబిఎఫ్ సినియర్ నాయకులు దత్తం స్వామి, సి సి సి జిల్లా నాయకులు ప్రవీణ్,జిల్లా అధ్యక్షులు వినయ్ ,ప్రదాన కార్యదర్శి బ్యాగరి వేణు,జిల్లా కార్యదర్శి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.