ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కౌటింగ్ రంగం సిద్దం

హైద‌రాబాద్
హైద‌రాబాద్ రంగా రెడ్డి మ‌హ‌బుబ్ న‌గ‌ర్ టిచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కౌటింగ్ కు అన్ని ఎర్పాట్లు చేశారు అధికారులు. 21మంది అభ్య‌ర్తులు పోటిప‌డుతున్నా ఈ ఎన్నిక‌లో  కౌటింగ్  ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంటుంది. ప్రాద‌న్యాత క్ర‌మంలో ఒటింగ్ కు  అవ‌కాశం ఉండ‌టంతో చెల్లుబాటు అయిన ఒట్లలో స‌గంకంటే ఎక్క‌వ ఒట్లు వ‌చ్చిన వారిని గెలుపోందినట్లుగా ప‌రిణిస్తారు.

హైద‌రాబాద్ రంగా రెడ్డి మ‌హ‌బుబ్ న‌గ‌ర్ టిచ‌ర్స్ ఎమ్మెల్సీ ఒట్ల లెక్కింపుకు రంగం సిద్దం అవుతుంది. ప్రిప‌రేన్సియ‌ల్  ప‌ద్ద‌తిలో త‌మ‌కు న‌చ్చిన వ్య‌క్తులంద‌రికి ఒటు వేయ్య‌డానికి హక్కు ఉండ‌టంతో పోటిలో ఉన్న అభ్య‌ర్థులంద‌రికి  ఒటు వేయ్య‌వ‌చ్చు. అయితే పోటిలో ఉన్న  వారు ఎవ్వ‌రూ న‌చ్చ‌కుంటే నోటాకు కూడా ఒటు వేసే అవ‌కాశం క‌ల్పించింది ఎన్నిక‌ల క‌మీష‌న్.  అయితే నోటాకు మొద‌టి ప్రాధాన్య‌తా ఒటు   వేసి  అభ్య‌ర్తుల‌కు ఇత‌ర ప్రాదాన్య‌త‌లు ఇస్తే అలాంటి  ఒట్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోరు. మొత్తం 29,720మంది ఒటర్లు ఉండ‌గా….. వారిలో 25866    మంది త‌మ ఒటు హ‌క్కును వినియోగించుకున్నారు. మొత్తం 137 పోలింగ్ కేంద్రాలలో ఉన్న బ్యాలెట్ బాక్స్ లను సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో భద్రపరిచారు అధికారులు

ఇక సరూర్నగర్ లోని ఇండోర్ స్టేడియంలో బుధవారం ఉద‌యం 8గంట‌ల‌కు కౌటింగ్ ప్రారంభం అవుతుంది. కౌటింగ్ కోసం మొత్తం 28 టేబుళ్ళ‌ను కౌంటింగ్ కోసం ఏర్పాటు చేశారు.  మొద‌టి ప్రాధాన్య‌తా క్ర‌మంలో గెలుపు ఫైన‌ల్ కాకుంటే ఇబ్బందులు రాకుండా  3 షిఫ్ట్‌ల‌కు కౌంటింగ్ సిబ్బందిని రెడి చేశారు.   ఒక్కో షిఫ్ట్‌కు 30 మంది కౌంటింగ్ సూప‌ర్‌వైజ‌ర్‌లు, 90 మంది కౌంటింగ్ అసిస్టెంట్‌ల‌ను నియమించారు. ప్ర‌తి టెబుల్ వ‌ద్ద న‌లుగురు అధికారులు ఉంటారు.  మొద‌ట బ్యాలెట్ బాక్స్ ల‌కు ఒపెన్ చేసిన డ్రమ్ముల‌లో వేసి వాటిని క‌లుపుతారు. త‌రువాత వాటిని 100 బ్యాలెట్ పేపర్ల చొప్పున ఒక బెండ‌ల్ గా  చేస్తారు. వీటిని లెక్కేంచే ట‌ప్పుడు చెల్లని ఒట్ల‌ను….,  గుర్తించి వేరు చేస్తారు. ఈ బిండల్స్ అన్నింటిని మిక్స్ చేసి తర్వాత టెబుల్ నంబ‌ర్ ప్ర‌కారం  పంఫిణి చేసి అక్క‌డ అభ్య‌ర్థుల వారిగా ఒచ్చిన  బ్యాలెట్ పేప‌ర్ల‌ను వేరు చేసి కౌంటింగ్ చేస్తారు. చెల్లుబాటు కాని ఒట్లు మిన‌హా మిగిలిన ఒట్ల‌లో 50శాతం ఒట్ల‌ను కోటా ఒట్లుగా ప‌రిగ‌ణిస్తారు. కోట ఓట్లు ఫిక్స్ అయిన తర్వాత స‌గం ఒట్ల‌కంటె ఎక్కువ వ‌చ్చిన వారిని విన్న‌ర్ గా ప్ర‌క‌టిస్తారు అయితే మొద‌టి ప్రాధాన్యాతా ఒట్ల‌లో స‌గం కంటెత‌క్కువ ఒట్లు వ‌స్తే  రెండ‌వ ప్రాధాన్యాతా ఒట్లు లెక్కిస్తారు.   కౌంటింగ్ ఏర్పాట్లను ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ పరిశీలించారు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు .

ఇక పోస్టల్ బ్యాలెట్ ఒట్ల‌ను మొద‌ట లెక్కించాల్సి ఉన్న‌ప్ప‌టికి ఒక్క పోస్టల్ బ్యాలెట్ కూడా  రాలేదు.  ఒట్ల లెక్కింపుకోసం ప్ర‌తి అభ్య‌ర్థి నుండి ఒక్కోటెబుల్ కు  ఒక్కో ఎజెంట్ కు అవ‌కాశం క‌ల్పిస్తారు.  కౌంటింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా నిర్వ‌హించేందుకు   హ‌ల్లో వెబ్ కేమెరాలు ఎర్పాటు చేస్తారు. లోపలికి వచ్చే కౌంటింగ్ సిబ్బంది మరియు కౌంటింగ్ ఏజెంట్లు ఎవరు కూడా బయట నుంచి పెన్నులు మరియు ఇతర ఎలాంటి పరికరాలు తీసుకురావద్దని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. స్టేడియం సరౌండింగ్ లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని గుర్తింపు లేని వ్యక్తులు ఎవరు కూడా అటు రావద్దని చెప్పుకొచ్చారు అధికారులు.  కౌంటింగ్ పూర్తి అయిన త‌రువాత వివ‌రాలు ఎన్నిక‌ల క‌మీష‌న్  కు  పంఫిస్తారు అక్క‌డి నుండి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చాక ఫ‌లితాన్ని ప్ర‌క‌టిస్తారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest