- ఏషియన్ గేమ్స్ లో తెలంగాణకు కొనసాగుతున్న పతకాల పంట
- నిఖత్ జరీన్ , అగసర నందిని ల అద్బుత విజయాలు
- ఏషియన్ గేమ్స్ లో భారత బాక్సర్, నిఖత్ జరీన్ కు చెరో కాంస్య పతకం
- హెప్టాథ్లాన్‌లో కాంస్య పతకం సాధించిన గురుకుల విద్యార్థిని అగసర నందిని
- ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అభినందనలు
చైనా
చైనాలో కొనసాగుతున్న ఆసియా క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు తమ సత్తా చాటుతున్నారు.బాక్సింగ్, హెప్టాథ్లాన్ క్రీడా విభాగాల్లో తెలంగాణ ఆణిముత్యాలు నిఖత్ జరీన్ , అగసర నందిని ఆదివారం జరిగిన ఆసియా క్రీడల్లో కాంస్య పతకాలు సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె . చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.ఇద్దరు బిడ్డలు రాష్ట్రం గర్వపడే విజయాలు సాధించారని సిఎం కొనియాడారు. తెలంగాణ గురు కులాలు ఇప్పటికే విద్యారంగంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన నేపథ్యంలో ఆసియా క్రీడల్లో సత్తా చాటడం గొప్ప విషయం అని సిఎం అన్నారు.
రాష్ట్ర క్రీడాకారులు తెలంగాణ తో పాటు దేశ ఖ్యాతి ని మరో మారు చాటారని సిఎం కొనియాడారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో తెలంగాణ బిడ్డలు తమ ప్రతిభను ప్రదర్శించి పతకాలు సాధించి తెలంగాణకే కాకుండా దేశానికే వన్నె తేవడం సంతోషంగా వుందని సిఎం అన్నారు.క్రీడాకారులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని, ఈ ప్రోత్సాహం ఇలాగే కొనసాగుతుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.
అగసర నందిని
ఆసియా క్రీడాల్లో తెలంగాణ గురుకుల విద్యార్థిని అగసర నందిని హెప్టాథ్లాన్‌లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్ లో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణి నందిని. నందిని సంగారెడ్డి లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీ లో బిబిఎ (BBA) రెండో సంవత్సరం చదువుతున్నది. నర్సింగి లోని గురుకుల పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్నది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ వెల్ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఐనిస్టిట్యూషన్ సొసైటీ అథ్లెటిక్స్ అకాడమీ మొదటి బ్యాచ్ విద్యార్థిని.
సాధారణ పేద కుటుంబంలో నందిని జన్మించింది. ఆమె తండ్రి యల్లయ్య చాయ్ అమ్ముతూ తన కూతురు ను గురుకుల పాఠశాల లో చేర్పించారు. నందిని విద్య లో రానిస్తూనే క్రీడా రంగంపై ఆసక్తి పెంచుకున్నది. హెప్టాథ్లాన్‌లో రానిస్తూ నందిని వివిధ అంతర్జాతీయ వేదికల్లో నిరంతరం తన అత్యుత్తమ ప్రదర్శనను అందిస్తూ అభినందనలు అందుకుంటోంది.
నిఖత్ జరీన్
నిఖత్ జరీన్ 12 ఏళ్ల వయసులో నిజామాబాద్‌లో జరిగిన అథ్లెటిక్స్ మీట్‌లో పాల్గొంది. వరుసగా రెండుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది. మహిళల బాక్సింగ్ సీనియర్ విభాగంలో దిగ్గజ మేరీ కోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు వరల్డ్ చాంపియన్‌షిప్ నెగ్గిన రెండో భారత బాక్సర్‌గా నిఖత్ జరీన్ ఘనత సాధించింది. నిజామాబాద్‌లో పుట్టిపెరిగిన నిఖత్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటోంది. నిఖత్ తండ్రి క్రికెట్, ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఆ ఆసక్తే ఆయన నలుగురు కూతుళ్లలో ఇదర్ని క్రీడాకారిణులుగా తయారు చేసేలా చేసింది. సిఎం కేసీఆర్ దార్శనికతతో క్రీడాకారులకు అందిస్తున్న ప్రోత్సాహం సత్ఫలితాలనిస్తున్నది.
ఏషియన్ గేమ్స్ లో ఎగిరిన తెలంగాణ జెండా
: రాష్ట్రానికి పతకాల పంట
:ఇషా,నిఖత్ ,నందిని ల అద్బుత విజయాలు
ఏషియన్ గేమ్స్ లో వివిధ క్రీడా విభాగాల్లో తెలంగాణ ఆణిముత్యాలు సత్తా చాటి, రాష్ట్రం గర్వపడే విజయాలు సాధించారని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ హరర్షం వ్యక్తం చేశారు.సీఎం కేసీఆర్ గారి ప్రోత్సాహంతో చైనా వేదిక గా జరిగిన ఏషియన్ గేమ్స్ లో తెలంగాణ ప్రతిభకు పతకాల పంట స్వంత మారిందన్నారు.ఈ ముగ్గురి విజయం తెలంగాణ రాష్ట్ర యువత లో కొత్త ప్రేరణ కలిగించిందన్నారు.ఇషా,నిఖాత్,నందిని ల కు మొదటి నుంచి అన్ని విధాలా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండగా నిలవడం వల్లే ఏషియన్ దేశాల ను వెనక్కి నెట్టేసి తెలంగాణ బంగారాలు విజేత లు గా నిలిచారని ఆనందం వ్యక్తం చేశారు.ప్రతిభ కలిగిన క్రీడా కారులకు సీఎం కెసిఆర్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆంజనేయ గౌడ్ అన్నారు.