కరీంనగర్ గడ్డ మీదే సోనియా మాట ఇచ్చారు

మానకొండూర్

కరీంనగర్ గడ్డ మీదే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుస్తామని సోనియా మాట ఇచ్చారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. మాట తప్పక.. మడమ తిప్పక తెలంగాణ ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నారు.డబుల్ బెడ్రూం.. ఇంటికో ఉద్యోగం, అంటూ కేసీఆర్ ప్రజల్ని నమ్మించి మోసం చేశారు.రసమలాయ్ ని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీసమస్యలపై కొట్లాడలేదు.దొరలకంటే తానేం తక్కువ కాదని ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కట్టుకుండు.అక్రమాలను ప్రశ్నించినవారిపై వేధింపులకు పాల్పడ్డాడు.ఈ ఎమ్మెల్యే వల్క దళిత బిడ్డ శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు.ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులు, అక్రమ కేసులు పెడుతున్నారు.పరాయి వాడు కాబట్టే.. ఇక్కడి ప్రజలపై కేసులు పెడుతుండు.మానకొండూర్ తో ఎమ్మెల్యే రసమలాయ్ కి పేరు బంధం లేదు, పేగు బంధం లేదు.అందుకే ఈ ప్రాంతాన్ని దోచుకు తింటున్నాడు.కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన భూములను గుంజుకుని ఈ ప్రభుత్వం దళిత, గిరిజనుల ఉసురు పోసుకుంటోంది.రైతులకు తొమ్మిది గంటల ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ది. కాంగ్రెస్ ఏం చేసిందని కొందరు సన్నాసులు అడుగుతున్నారు. జూరాల, సాగర్, శ్రీశైలం, నెట్టెంపాడు,బీమా,ఎస్ఆర్ఎస్ పీ ప్రాజెక్టులన్నీ కట్టింది కాంగ్రెస్. ఈ వేదికగా బీఆరెస్ నేతలకు సవాల్ విసురుతున్నామీకు దమ్ముంటే 2004 నుంచి 2014 వరకు మేమేం చేశామో.2014 నుంచి 2023 వరకు మీరేం చేశారో చర్చించడానికి సిద్ధమా?డ్రామారావు సెల్ఫీలు దిగుతున్న శిల్పారామం కూడా కాంగ్రెస్ హయాంలో కట్టిందే.రాష్ట్రంలో ఎక్కడ చూసినా దుఃఖమే కనిపిస్తుంది.కేసీఆర్ తెలంగాణ తెచ్చిన అంటే.. రెండుసార్లు అవకాశం ఇచ్చారు.అరవయ్యేళ్ల తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి.. అందుకు మీ ఆశీర్వాదం కావాలి.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇళ్లు లేని ప్రతీ పేదవాడికి ఇళ్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు అందిస్తాం.ఆరోగ్యశ్రీ ద్వారా పేదల వైద్యానికి రూ.5 లక్షల వరకు ప్రభుత్వమే భరిస్తుంది.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం.పేద రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటాం. కొత్త ప్రభుత్వంలో 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం. ధరణి దందాలపై విచారణ చేపట్టి.. ధరణి పోర్టల్ చేంజ్ రద్దు చేస్తాం రేవంత్ రెడ్డి అన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest