కరెంటు తీగలు పట్టుకునేందుకు మేం రెడీ: మంత్రి జగదీష్ రెడ్డికి పొన్నం ప్రభాకర్ సవాల్

వేములవాడ :
రాష్ట్రంలో వ్యవసాయానికి 24గంటల కరెంటు అందడం లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కరెంట్ తీగలు పట్టుకునేందుకు తాము రేడీగా ఉన్నామని, దమ్ముంటే జగదీష్ రెడ్డి తన సవాల్ స్వీకరించాలన్నారు. శ్రీరాంసాగర్ నీళ్లను కేసీఆర్ మహారాష్ట్రకు ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. శ్రీరాంసాగర్ నీళ్లు ముడితే రక్తపుటేరులు పారుతాయని ఆయన హెచ్చరించారు. కొండగట్టు బస్సు ప్రమాదం బాధితులను కేసీఆర్ ఇప్పటికీ పరామర్శించలేదని, వేములవాడ రాజన్నకు శఠగోపం పెట్టిన ఘనుడు కేసీఆర్ అని ఆయన ఎద్దేవా చేశారు. అటు ప్రధాని మోదీ వైఖరిపైనా పొన్నం మండిపడ్డారు. ఆదాని వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో మాట్లాడకపోవడం దారుణమన్నారు. ప్రధాని మోదీ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, బీబీసీ మీడియా సంస్థపై ఐటీ దాడులు చేయడం హేయమైన చర్యగా ఆయన అభిప్రాయపడ్డారు. అన్యాయాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని పొన్నం ప్రశ్నించారు.విసునూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.

మంత్రి ఎర్రబెల్లపై ఛార్జ్ షీట్ విడుదల

మంత్రి ఎర్రబెల్లిపై కాంగ్రెస్ నేతలు చార్జీషీట్ విడుదల చేశారు. ఒకప్పుడు రేషన్ డీలర్ గా ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుకు ఇప్పుడు కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ప్రశ్నించారు. కోలుకొండలో 200ఎకరాలు గ్రానైట్ కంపెనీలకు అప్పగించారని, దయాకరరావు ఏపని చేసినా 30శాతం కమీషన్ తీసుకుంటారని ఆరోపించారు. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొనేందుకు రైతులు ఎడ్ల బండ్లతో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా వస్తే పోలీసులతో అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. రైతులను హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ కు తరలించారన్నారు. కేసీఆర్ అంటేనే అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ అని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య విమర్శించారు. దళిత బంధులో అక్రమాలు జరుగుతున్నాయని.. అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest