హైదరాబాద్ :
తెలంగాణ ఎం ఎల్ సి కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో హైడ్రామా నడిచింది. విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. కానీ కవిత తాను రాలేనని చెప్పడంతో 20వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ విషయం ప్రస్తుతం కోర్టులో ఉంది . అయితే ఎమ్మెల్సీ కవిత నిందితురాలా లేక అనుమనితురాలా అంటూ ఈడిని కోర్టు ప్రశ్నించగా,
ఎమ్మెల్సీ కవిత నిందితురాలు కాదు, కేవలం అనుమనితురాలే మాత్రమే అని రౌస్ అవెన్యూ కోర్టుకి ఈడి తెలిపింది. కవిత తరపు వాదిస్తున్న న్యాయావాది మాత్రం కొన్ని సెక్షన్ల ప్రకారం మహిళలను ఇంటిలోనే విచారించాలి అంటున్నారు. మహిళలకు ప్రత్యేక హక్కులు ఉంటాయని కవిత తరపు న్యాయవాది పేర్కొన్నారు.
Post Views: 42