కవిత పిటిషన్ తిరస్కరించిన సుప్రీమ్ కోర్ట్

న్యూ ఢిల్లీ :
తెలంగాణ ఎం ఎల్ సి కల్వకుంట్ల కవిత కు సుప్రీమ్ కోర్ట్ లో చుక్కెదురైంది. ఈనెల 20వ తేదీన ఈడీ విచారణకు హాజరుకావాల్సిన నేపథ్యంలో శుక్రవారమే తన పిటిషన్ ను విచారించాలని కవిత కోర్టును ఆశ్రయించింది. అయితే కవిత పిటిషన్ ను సుప్రీం కోర్ట్ తిరస్కరించింది. షెడ్యూల్ ప్రకారమే 24వ తేదీన పిటిషన్ ను విచారిస్తామని సుప్రీమ్ కోర్ట్ తేల్చి చెప్పింది. కోర్టు విచారణ తరువాత ఈడీ విచారణకు హాజరు అవుతానని కవిత ఈడీకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే తన పిటిషన్ ను వెంటనే విచారించాలని కోర్టును ఆశ్రయించింది. కవిత వేసిన ఎమర్జెన్సీ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. మంత్రులు ఇద్దరు ముగ్గురు ఇదే పని మీద ఢిల్లీలో మకాం వేశారు. 20వ తేదీన విచారణకు హాజరు అవుతారా ? లేదా? అనేది వేచి చూడాల్సిందే.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest