కాకులమర్రికి కేసీఆర్ శ్రద్ధాంజలి

హైదరాబాద్

మాజీ మంత్రి, దివంగత కె. విజయరామారావు నివాసానికి సీఎం  కేసీఆర్ చేరుకుని, వారి పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుమారుడు, కూతురు, అల్లుడు, ఇతర కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు. ఇంటి పెద్దను కోల్పోయిన దుఃఖంలో వున్న వారిని ఓదార్చి ధైర్య వచనాలు తెలిపారు. అధికారికంగా జరుగుతున్న అంత్యక్రియలకు సంబంధించి జరగాల్సిన ఏర్పాట్ల గురించి సీఎం ఆరాతీశారు.ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే  దానం నాగేందర్, ఎమ్మెల్సీలు  మధుసూధనా చారి,  కడియం శ్రీహరి, ఎమ్మెల్యే  జీవన్ రెడ్డి, తదితరులు నివాళులర్పించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest