హైదరాబాద్ :
క్యాసినో కింగ్ ప్రవీణ్ చీకోటి కారు చోరీకి గురయింది. సైదాబాద్ లోని ఆయన ఇంటి నుంచి కారును దుండగులు దొంగిలించినట్టు చీకోటి ప్రవీణ్ సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్నోవా కార్ కీస్ వెతికి కార్ తో దొంగలు పరారయ్యారు. సీసీటీవీ కెమెరా లో చోరీ దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి. పోలీస్ ప్రొటెక్షన్ కావాలంటూ గతంలో పోలీసులకు ప్రవీణ్ విన్నవించారు. తనకు తన కుటుంబానికి రక్షణ కోసం గన్ మేన్స్ కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రవీణ్ కోరారు. తన ఇంటిని రెక్కీ నిర్వహిస్తున వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేయాలంటూ ప్రవీణ్ డిమాండ్ చేశారు.
Post Views: 62