కొంగు బంగారం కోటంచ నృసింహుడు

  • కోరిన కోరికలు తీర్చే కోటంచ నృసింహుడు
  • కోటివరాల క్షేత్రంగా విరాజిల్లుతున్న లక్ష్మీనరసింహ స్వామి ఆలయం
  • నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
  • 7 నుండి జాతర ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు

 

జయశంకర్ భూపాలపల్లి  (రేగొండ)

కోరిన కోర్కెలు తీర్చి..భక్తుల కొంగు బంగారంగా నిలుస్తున్నాడు కోటంచ నృసింహుడు. రేగొండ మండలంలోని కొడవటంచ లక్ష్మీనరసింహ స్వామిని సత్య నిష్టతో నమ్మి కొలిచిన భక్తుల కష్టాలు తీరుస్తాడని విశ్వాసం. ఏటా ఫాల్గుణ శుద్ధ దశమికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మార్చి 02 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై వారం రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. వందల ఏండ్ల చరిత్ర కలిగిన కొడవటంచ క్షేత్రం భక్త జనం పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతోంది. మానసిక రుగ్మతలను పారద్రోలుతూ కోరి మొక్కిన వారి కష్టాలు తీరుతుండడంతో రోజురోజుకూ భక్తుల తాకిడి పెరుగుతోంది. నిత్యం పూజలందుకుంటున్న స్వామి వారికి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 03న అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు.

మహిమానిత్వం ఆలయ సన్నిధి
కొడవటంచ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సన్నిధి మహిమాన్వితమైనది. మానసిక వ్యాధులతో బాధ పడే వారు స్వామి వారిని దర్శించుకుంటే వ్యాధులను మటుమాయమవుతాయనేది నమ్మకం. మానసిక వ్యాధితో బాధపడేవారు ఆలయ ప్రాంగణంలో ఉంటూ స్వామివారిని కొలుస్తుంటారు. అంతేకాకుండా నిత్యం భక్తులు స్వామివారిని దర్శించుకొని తమ కోరికలు నెరవేరాలని మొక్కులు చెల్లించుకుంటారు. కోరిన కోర్కెలు నెరవేరిన భక్తులు జాతర సమయంలో మేక, గుర్రం ప్రభ బండ్ల వాహనాలను కట్టి ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంటారు. సంతానం లేని భక్తులు సంతానం కోసం తడిబట్టలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు.

లక్ష్మీ నరసింహ స్వామి చరిత్ర..

కొడవటంచ లక్ష్మీనరసింహ స్వామి చరిత్రను ఇక్కడి ప్రజలు ఆసక్తికరంగా చెప్పుకుంటారు. స్వామి వారి మహత్యం మహా గొప్పదని ప్రచారం జరుగుతుంది. వందల ఏళ్లకు పూర్వం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తల వంశమైన తూర్పు రాణి రంగాచార్యులు ఈ ఆలయాన్ని వెలుగులోకి తెచ్చారు. రంగాచార్యులు ఒకనాడు ఆలయ ప్రాంతంలోని చేదబావిలో నీరు తోడుతుండగా లక్ష్మీ నరసింహ స్వామి వారి ప్రతిమ లభించింది. తర్వాత ఆచార్యులకు కలలో కనిపించిన స్వామి బావి సమీపంలో శిలావిగ్రహం రూపంలో ఉన్నట్లు చెప్పి మాయమైనట్లు చెబుతుంటారు. అయితే ఎంత వెతికినా స్వామివారి ప్రతిమ కనిపించలేదు. తర్వాత రంగాచార్యులకు మళ్లీ కలలో సాక్షాత్కరమైన స్వామి తన విగ్రహం గల ప్రదేశానికి ఆనవాలుగా ఇటుక ఆకారంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహంలో తాను నిక్షిప్తమై ఉన్నట్లు చెప్పి మళ్లీ మాయమైనట్లు భక్తులు పేర్కొంటున్నారు. దీంతో రంగాచార్యులు కొడవలి సహాయంతో పుట్ట తొలుస్తుండగా స్వామి వారి విగ్రహం తాకి కొడవలి వంగి పోయిందని, కొడవలిని వచ్చిన స్వామి పేర క్షేత్రం కోటంచగా స్థిరపడిపోయింది. ప్రస్తుతం కొడవటంచగా పిలవబడుతోంది. స్వామి వారు ఉన్న ప్రదేశంలోనే ఆలయ నిర్మాణం జరిగిందని చెప్పుకుంటారు.

నిత్య పూజలు
నిత్యం పూజలతో క్షేత్రం భక్తి పారవశ్యంతో పొంగిపోతుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం వెలిసిన కొడవటంచలో ఒకప్పుడు జాతర సమయంలోనే భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోరికలు తీరుతుండడంతో జాతర సమయంలోనే కాకుండా నిత్యం స్వామివారికి పూజలు చేసేందుకు భక్తులు ఆలయానికి వస్తున్నారు. కొత్త వాహనాలు పూజలు చేసేందుకు కూడా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేసుకుంటారు. ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి స్వామి వారి సేవా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ఎక్కడాలేని విధంగా త్రికాల ఆరగింపు కేవలం కొడవటంచ ఆలయంలోనే నిర్వహించడం ప్రత్యేకత. ప్రతీ నెల స్వామి వారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. నివేదన సమయంలో ఆలయ సన్నిధిలో సమానత్వానికి సూచికగా భక్తులను కూర్చోబెట్టి స్వామివారి ప్రసాదాన్ని అందిస్తారు.

దినదినాభివృద్ధి
ఒకప్పుడు చిన్న ఆలయంగా ఉన్న కొడవటంచ ప్రస్తుతం పెద్ద దేవాలయంగా ఏర్పడింది. భూపాలపల్లి నియోజకవర్గలో ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అనేక నిధులు తెప్పించి ఆలయ అభివృద్ధికి కృషి చేసరు కోరికలు నెరవేరిన భక్తులు సైతం లక్షల్లో చందాలు ఇచ్చి ఆలయ అభివృద్ధికి పాటుపడుతున్నారు. భక్తులు ఇచ్చిన చందాలతో ప్రస్తుతం రేగొండ మండల కేంద్రంతో పాటు, లింగాల క్రాస్, కొడవటంచ గ్రామంలో ఆలయ తోరణాలను ఏర్పాటు చేసరు . రూ.75 లక్షల సింగరేణి నిధులతో కళ్యాణ మండపం, భక్తులు కూర్చునేందుకు రేకుల షెడ్లు, భక్తుల సౌకర్యార్థం ఐదు గదులతో సత్రాలను నిర్మించారు. ఆలయ గర్భగుడిలో ఏసీ లను ఏర్పాటు చేశారు. రెండు ప్రత్యేక వీఐపీ గెస్ట్ హౌస్ లు, శాశ్వత మరుగుదొడ్లను నిర్మించారు.

3 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఈ నెల 3 నుంచి 9 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబవుతోంది. మార్చి 3 న కళ్యాణ మహోత్సవం మార్చి 7.8.9 తేదీల్లో జాతర వాహనాలు తిరుగుట, స్వామి వారి పెద్ద రథోత్సవం వేడుకలు జరుగుతాయి. నాగబలి కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
మార్చి ఏడు నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. చలువ పందిళ్లు, విద్యుత్ అలంకరణ ఏర్పాటు చేశాం. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి సహకారంతో జాతర సమీపంలోని రహదారులకు ఇరుపక్కల జంగల్ కటింగ్ చేపించం. రహదారులకు మరమ్మతులు చేశాం.మార్చి మూడు నా స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యాం. ఈ కళ్యాణోత్సవానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి దంపతులు హాజరై పట్టువస్త్రాలు సమర్పిస్తారు

జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం
ఆలయ ఛైర్పర్సన్ మదటి అనిత
ఇనెల 02 నుండి అత్యంత వైభంగా జరిగే బ్రహ్మోత్సవలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ఆదేశాల మేరకు జాతరకు వచ్చే భక్తులకు ఎండాకాలం సమీపిస్తున్నది కావున చలవ పందిళ్ళు మంచినీటి వసతి వైద్య సదుపాయాలు పరకాల నుండి భూపాల్ పల్లి నుండి
బస్ సౌకర్యం కల్పిస్తున్నాం అని అన్నారు

జాతరను విజయవంతం చేస్తాం
ఈఓ శ్రీనివాస్
ఈసారి జాతర భక్తులు ఆలయ అధికారుల పాలక మండలి సహకారంతో విజయవంతం చేస్తామని ఈఓ బిల్లా శ్రీనివాస్ తెలిపారు జాతరకి వచ్చే భక్తులు ఆలయ సిబ్బందికి సహకరించాలని అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest