గంగాధర శాస్త్రికి ‘గౌరవ డాక్టరేట్’

హైదరాబాద్ , మే 25 :
ప్రసిద్ధ గాయకులు, గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎల్ వి గంగాధర శాస్త్రి కి – ఉజ్జయిని లోని ‘మహర్షి పాణిని సంస్కృత ఏవం వైదిక్ విశ్వవిద్యాలయం’ నాల్గవ స్నాతకోత్సవం లో ‘గౌరవ డాక్టరేట్’ ను ప్రదానం చేసింది. మే, 24, 2023 న ఉజ్జయిని, మధ్యప్రదేశ్, కోఠీ మార్గ్ లోని విక్రమ్ కీర్తి మందిరం లో ఉదయం గం. 11.30 ని లకు జరిగిన ఈ ఉత్సవానికి ముఖ్య అతిథి గా ఉన్నత విద్య శాఖామంత్రి డాII మోహన్ యాదవ్, విశిష్ట అతిథులు గా ఇస్రో చైర్మన్ శ్రీధర్ సోమనాథ్, పార్లమెంటు సభ్యులు శ్రీ అనిల్ ఫిరోజియా, ఉజ్జయిని శాసన సభ్యులు శ్రీ పారస్ చంద్ర జైన్, విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య విజయకుమార్ సి జి, రిజిస్ట్రార్ డాII దిలీప్ సోని లు హాజరయ్యారు. భగవద్గీత ప్రచారం ద్వారా ఇటు సంస్కృత భాషనీ, అటు ఈ దేశపు ఆధ్యాత్మిక సంస్కృతిని కాపాడుతూ, గీతా గాన ప్రసంగాలతో ప్రజలను చైతన్య పరుస్తూ తన జీవితాన్ని అంకితం చేసినందుకు మంత్రి మోహన్ యాదవ్, విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య సి జి విజయ కుమార్ గంగాధర శాస్త్రిని ప్రశంసించి స్పందనని కోరాగా, గంగాధర శాస్త్రి గాన ప్రసంగం ప్రారంభిస్తూ – వసుదేవ సుతం దేవం.. అంటూ శ్రీకృష్ణ ప్రార్ధన గానం చేస్తూండగానే సభామందిరమంతా కరతాళధ్వనులతో నిండిపోయింది.
” స్వార్ధ రహిత ఉత్తమ సమాజo కోసం భగవద్గీతా ప్రచారమే జీవితం గా మలుచుకున్న నేను 2006 లో పరిశోధనాత్మక కృషితో, స్వీయ సంగీతం లో, తెలుగు తాత్పర్య సహిత, సంపూర్ణ భగవద్గీతా గాన రికార్డింగ్ ప్రాజెక్టు ను పూర్తి చేసి, విడుదలచేసి డా. ఏ పి జె అబ్దుల్ కలామ్, ప్రధాని  నరేంద్ర మోడీ అభినందనలు అందుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్టు ఒక మ్యూజికల్ థీసిస్ లాంటిది. సంస్కృత వాఙ్మయానికి దిక్సూచి, వ్యాకర్త అయిన మహర్షి పాణిని పేరుతో స్థాపించిన ఈ సంస్కృత విశ్వ విద్యాలయం నుంచిఈ రోజు గౌరవ డాక్టరేట్ ను అందుకోవడం సముచితం గా, మహద్భాగ్యం గా, జన్మ ధన్యతనొందినట్లు గా భావిస్తున్నాను. నా ఈ 17 ఏళ్ళ గీతా ప్రయాణం లో ఆశీర్వదించిన నా తల్లి తండ్రులు, సద్గురువులు, గా సహకరించిన నా భార్యాబిడ్డలు, ప్రపంచ వ్యాప్తంచేయూతనందించిన ఎందరో భగవద్బంధువులకు వినయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా ఈ గీతా ప్రయాణాన్ని దగ్గరనుండి పరిశీలించి నేడు నాకీ గౌరవాన్ని కట్టబెట్టడానికి ప్రధాన కారకులైన మధ్యప్రదేశ్ బి జె పి పార్టీ ఇంఛార్జి శ్రీ పి మురళీధర రావు గారికి, మంత్రివర్యులు డా II మోహన్ యాదవ్ గారికి, ఆచార్య సి జి విజయకుమార్ లకు కృతజ్ఞతలు !…యద్యదాచరతిసశ్రేష్ఠ.. అంటూ ప్రపంచం అనుసరించేవిధం గా ప్రతి ఒక్కడూ ఉత్తముడు గా ఎదగాలని గీత ద్వారా సర్వమానవాళికి హితవు చెప్పిన జగద్గురువైన శ్రీకృష్ణపరమాత్మ పుట్టిన భారత భూమిలో పుట్టినందుకు గర్వపడుతూ … జై శ్రీకృష్ణ ! జై శ్రీరామ్ ! జై మహర్షి పాణిని ! భారత్ మాతా కీ జై ! ” అంటూ కరతాళ ధ్వనులందుకున్నారు. ముఖ్య అతిథులకు శ్రీ గంగాధర శాస్త్రి తన సంపూర్ణ భగవద్గీతా సి డి ప్యాక్స్ ను బహూకరించారు. మధ్యప్రదేశ్ లోని ABVP, విశ్వహిందూ పరిషత్ సభ్యులు అనేకమంది గంగాధర శాస్త్రి తో సంభాషించారు. తమ సంస్థ కార్యక్రమాలకు ఆయనను ఆహ్వానించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest