సంగారెడ్డి :
గీతం యూనివర్సిటీ విద్యార్థులు 65 నెంబర్ జాతీయ రహదారిపై హల్ చల్ చేశారు. ఒకపక్క జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. ఇష్టమొచ్చిన విధంగా వేగంగా వాహనాలు నడుపుతో నహనదారులను భయ భ్రాంతులకు గురి చేశారు.
ఈనెల 15, 16, 17,తేదీలలో గీతం యూనివర్సిటీలో జరగబోయే ఓ ఈవెంట్ పేరుతో స్టూడెంట్స్ రోడ్ల పై రెచ్చిపోయారు. వాహనం మీద నిలబడి మరి ఏరుతూ హల్ చల్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండలం రుద్రారం జాతీయ రహదారిపై ఈ సంఘటన జరిగింది. ఈవెంట్ పేరుతో గీతం యూనివర్సిటీ చెందిన విద్యార్థులు కార్ల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పోలీసుల అనుమతి కూడా లేదని తెలుస్తోంది. ఒకటి రెండు వాహనాలకు పోలీస్ హౌన్డ్ హారన్ లు కూడా వినిపించాయి.
Post Views: 57