గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాలని BSP అల్టిమేటం

 

* గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాలని అల్టిమేటం
* 48 గంటల తర్వాత ఆమరణ నిరాహార దీక్ష
* కవిత నేరస్తురాలే… పార్టీ నుండి సస్పెండ్ చేయాలి.
* మోడి అదానిని కాపాడినట్లు.. కెసిఆర్ కవితను కాపాడుతున్నరు

  • వెలుగు, v6 ను బ్యాన్ చేయడం హిట్లర్,ముస్సోలినీ పాలనను తలపిస్తోంది.

నాగర్ కర్నూల్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాలని,లేకపోతే 48 గంటల్లో ఆమరణ నిరాహార దీక్ష చేసి,నిరుద్యోగులకు న్యాయం జరిగేవరకు పోరాడుతామని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అల్టిమేటటం జారీ చేశారు.
అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో న్అందితుడైన వ్యక్తికి గ్రూప్ 1 లో 103 మార్కులు రావడం అనేక అనుమానాలకు దారితీస్తుందని ఆరోపించారు.ఈ రోజు బహుజన రాజ్యాధికార యాత్ర 200 రోజులో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ నిర్మాత మాన్యవర్ కాన్శీరాం గారి 89వ జయంతి సందర్భంగా నాగర్ కర్నూల్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పేపర్ లీకేజీ కేసును సిబిఐ కి అప్పజెప్పి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సర్వీస్ కమీషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి పదవి నుండి వైదొలగాలని డిమాండ్ చేశారు.ఇప్పటివరకు జనార్దన్ రెడ్డి హయాంలో జరిగిన పోటీ పరీక్షలన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని పేర్కొన్నారు.నిరుద్యోగ యువత వల్లనే తెలంగాణ వచ్చిందని,వారికి న్యాయం జరిగేవరకు బిఎస్పి పోరాడుతుందని తెలిపారు.

కవిత వందశాతం నేరస్తురాలేనని స్పష్టం చేశారు.ప్రతి చార్జిషీట్ లో ఆమె పేరు వచ్చిందని,నేరస్తురాలు కాబట్టే 11 ఫోన్లు ధ్వంసం చేశారని ఆరోపించారు.కవితను ఇంకా ఎందుకు పార్టీ నుండి సస్పెండ్ చేయడం లేదని నిలదీశారు.
కేంద్రంలో మోడీ అదానీకి తోడుగా ఉండి కాపాడినట్లే,కెసిఆర్ కూడా కవ్తను కాపాడుతున్నారని ఆరోపించారు.లిక్కర్ స్కాం గురించి ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదన్నారు.

రాష్ట్రంలో సమాచార,పౌరసరఫరాల శాఖ ముఖ్యమంత్రి చేతిలో పెట్టుకొని ప్రశ్నించిన పత్రికలు చానెల్లను బ్యాన్ చేయడం దుర్మార్గమన్నారు.కెసిఆర్ పాలన హిట్లర్,ముస్సోలినీ వంటి నియంత పాలనను గుర్తుచేస్తుందని తెలిపారు.

అంమ్రాబాద్ లో బాలిక ఆత్మహత్య కాదు,హత్యేనని ఆరోపణలు వస్తున్న సందర్భంగా దీనిపై విచారణ చేపట్టాలని,నిందితులు ఎవరైనా వదలద్దని, బాధిత కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

స్థానిక ఎమ్మెల్యే ఆగడాలు ఎక్కువయ్యాయని,నల్లమట్టి అక్రమ రవాణా,గుండాయిజం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని అందుకే ప్రజలంతా ఈ దోపిడీ పాలకులను ఓడించి బిఎస్పి వైపు వస్తున్నారని,రాబోయే ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లాలో నీలిజెండా ఎగురవేస్తామని ప్రకటించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest