- రాష్ట్ర ఆర్థికమంత్రి మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్ : చదువులు మేం చెప్పిస్తే బీజేపీ వాళ్లు పేపర్లు లీక్ చేశారని రాష్ట్ర ఆర్థికమంత్రి మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. దొంగలను అరెస్టు చేసి జైలులో వేయడంతో ఇవాళ పదోతరగతి ప్రశ్న పత్రం లీక్ జరగలేదన్నారు. లీక్ దొంగలు జైల్లో ఉండటంతో పదోతరగతి పరీక్షలు సాఫీగా సాగాయని పేర్కొన్నారు. ఇప్పుడైనా బీజేపీ వాళ్లు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనించాలని హరీశ్‌రావు కోరారు. కమలాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల నుంచి పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీలో కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధాన కుట్రదారు అని పోలీసులు అభియోగం మోపిన విషయం తెలిసిందే. ఆయన ప్రోద్బలంతోనే మిగిలిన నిందితులు ప్రశ్నపత్రాన్ని పరీక్షకేంద్రం నుంచి దొంగతనంగా సేకరించి వాట్సప్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం బండి సంజయ్ కరీంనగర్ జిల్లా జైలులో ఉన్నారు.