టీడీపీని గుండెల్లో పెట్టుకుంటారు: చంద్రబాబు

 

హైదరాబాద్ :

టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని పార్టీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ భవన్‌లో ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి తెలంగాణలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ఇంటింటికీ తెలుగుదేశం కిట్లను చంద్రబాబు పంపిణీ చేశారు.

తెలంగాణలోని ప్రతి ఒక్కరూ టీడీపీని గుండెల్లో పెట్టుకుంటారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉందో కనిపిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణ గడ్డపై ఎన్టీఆర్‌ టీడీపీని ఏర్పాటు చేశారని చంద్రబాబు తెలిపారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే టీడీపీని స్థాపించారని వెల్లడించారు. గత 41 సంవత్సరాలుగా.. తెలుగు వాళ్ల కోసం పని చేస్తున్న పార్టీ టీడీపీ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

పేదవాళ్ల సంక్షేమం కోసం పథకాలు అమలు చేసిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు వెల్లడించారు. సంక్షేమ పథకాలు టీడీపీతోనే ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. పటేల్‌, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పేదవారికి ఎన్టీఆర్‌ స్వాతంత్య్రం అందించారని తెలిపారు. రైతుల కోసం భూమి శిస్తు రద్దు చేశారని వెల్లడించారు. మహిళలకు సాధికారిత కల్పించింది ఎన్టీఆర్‌ అని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా హైదరాబాద్‌లో మౌళిక వసతులను కల్పించామని చంద్రబాబు వెల్లడించారు.
‘సైబరాబాద్ నిర్మించిన ఘనత టీడీపీదే. దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు అని గుర్తు చేశారు. తెలుగుదేశం ఎక్కడ ఉంది అని ప్రశ్నించే వారికి ఖమ్మం సభ తర్వాత సమాధానం దొరికిందని చంద్రబాబు తెలిపారు. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారికోసం టీడీపీ పని చేస్తుంది. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం. సృష్టించిన సంపదను పేదవాళ్లకు అందించడమే లక్ష్యం. ప్రజల్లో ఉండాలనే సంకల్పం అందరూ తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోరారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest