హైదరాబాద్ :
నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దారావత్ ప్రీతీ కుటుంబసభ్యులను బి ఎస్ పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. పేద బి.సి.దళిత .గిరిజన బిడ్డల పట్ల ఒకలాగా ఆధిపత్య వర్గల పట్ల ఒకలాగా ప్రభుత్వం వ్యవహరించడం చాలా బాధాకరమని ఈ సందర్బంగా ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పేద వర్గాలకు గొంతు లేకపోవడం వల్ల అనేక సంఘటనలు జరుగుతున్నాయని అలాగే ర్యాగింగ్ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం చాలా బాధాకరమని అన్నారు, తక్షణమే ప్రీతి కాలేజీలో ఏం జరిగిందనేది పూర్తిస్థాయిలో విచారణ జరపాలని, అలాగే కాకతీయ మెడికల్ కాలేజ్ హెడ్ అఫ్ ద డిపార్ట్మెంట్ ని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ వెంకటేష్ చౌహన్ , అధికార ప్రతినిధి అరుణ తదితరులు ఉన్నారు.
