తెలంగాణలో రూ.13500 కోట్ల పనులకు శ్రీకారం చుట్టాం:మోడీ

మహబూబ్ నగర్ , 01 అక్టోబర్ 20203 :

తెలంగాణలో రూ.13500 కోట్ల పనులకు శ్రీకారం చుట్టాం. అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ప్రధాని బహిరంగ సభలో మాట్లాడారు.
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల చట్టం సాధించాం.తెలంగాణలో ఎన్నో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాం.హైవేల నిర్మాణంతో అన్ని రాష్ట్రాలతో తెలంగాణకు అనుసంధానం పెరిగింది.ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులతో మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ మధ్య అనుసంధానం పెరుగుతుంది.దేశంలో నిర్మించే 5 టెక్స్‌టైల్‌ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం.హన్మకొండలో నిర్మించే టెక్స్‌టైల్ పార్క్‌తో వరంగల్‌, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.ములుగు జిల్లాలో 900 కోట్లతో సమ్మక్క- సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటును ప్రకటించిన మోదీ.కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచమంతటికి తెలిసింది.కరోనా తర్వాత పసుపు పంటపై పరిశోధనలు పెరిగాయి.తెలంగాణ లో పసుపు బోర్డు ఏర్పాటును ప్రకటించిన మోదీ. పసుపు బోర్డు ఏర్పాటుతో రాష్ట్ర పసుపు రైతులకు ఎంతో ప్రయోజనం.రాష్ట్ర పసుపు రైతుల సంక్షేమానికి మేం కట్టుబడి ఉన్నాం.ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌గా హెచ్‌సీయూ ఏర్పాటు చేస్తామని మోడీ చెప్పారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest