తెలంగాణ ఉద్యోగుల సంఘం- 2023 డైరీ ఆవిష్కరణ

హైదరాబాద్

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి “తెలంగాణ ఉద్యోగుల సంఘం” 2023 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. బంజారాహిల్స్ లోని మినిష్టర్ క్వార్టర్స్ లో తెలంగాణ ఉద్యోగుల సంఘం చైర్మన్ ఎ. పద్మాచారి నేతృత్వంలో ఉద్యోగుల సంఘం సభ్యులందరి సమక్షంలో, మాజీ ఎంపీ, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బి. వినోద్ కుమార్ మాట్లాడుతూ, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉవ్వెత్తున ఎగసినటువంటి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి సంఘం తెలంగాణ ఉద్యోగుల సంఘం అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యోగులు చేసిన పోరాట సందర్భాలను నెమరేసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగులందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ఉద్యోగుల సంఘం డైరీని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే ఉద్యోగుల సంఘం చైర్మన్ ఎ. పద్మాచారి రిటైర్డ్ అయినప్పటికీ తెలంగాణ ఉద్యోగుల సమస్యలు, వాటి పరిష్కారానికి నిత్యం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ తన బాధ్యత చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారన్నారు. ఈ మధ్యకాలంలో సీఎం కేసీఆర్ ను ఢిల్లీలో కలిసి ఉద్యోగుల పలు సమస్యల పట్ల చర్చించారన్నారు. టీచర్ల బదిలీల పట్ల కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యోగులందరూ ప్రభుత్వానికి ఎప్పటిలాగే సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం చైర్మన్ ఎ. పద్మాచారి మాట్లాడుతూ తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సుదీర్ఘంగా సకలజనుల సమ్మె గాని, ఉద్యోగుల గర్జన గాని పెండౌన్ గాని పొలిటికల్ గాని, ప్రతి దాంట్లో కూడా మేము కేసీఆర్ తో కలిసి పనిచేయడం మాకు చాలా గౌరవంగా ఉన్నదన్నారు. సిఎం కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ వినోద్ కుమార్, హరీష్ రావు, కేటీఆర్ తోటి సుదీర్ఘంగా పనిచేస్తూ తెలంగాణ సమాజానికి జరిగే నష్టాన్ని, నీళ్లు నిధులు నియామకల్లో జరిగిన నష్టాన్ని, ఉద్యోగులకు జరిగిన నష్టాన్ని, ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో చూపిస్తూ, రేవూరి ప్రకాశ్ రెడ్డి కమిటీ గాని ఉత్తంకుమార్ రెడ్డి కమిటీ కానీ రాష్టప్రతి ఉత్తర్వులు, సిక్స్ పాయింట్ ఫార్ముల,160జివో అలా ప్రతి దాంట్లో అన్యాయమైనప్పుడు, సమైక్యాంధ్రుల వలన జరుగుతున్న అన్యాయాన్ని మేము బలంగా వ్యతిరేకించామన్నారు. తెలంగాణ సాధన తర్వాత తెలంగాణ యొక్క భవిష్య ఏ విధంగా ఉంటుందనే విషయంలో ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ వారిలో ఉద్యమస్ఫూర్తి కలిగించి, తెలంగాణ సాధన దిశగా వారిని ఉద్యమంలో భాగస్వాములుగా చేసిన సంఘం తెలంగాణ ఉద్యోగుల సంఘం అన్నారు. ఆవిధంగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తూ, ప్రతీ సంవత్సరం తెలంగాణ ఉద్యోగుల సంఘం డైరీని రిలీజ్ చెయ్యడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా బి.వినోద్ కుమార్ కి, గాంధీ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ జి.రాజేందర్ రెడ్డికి, మైనార్టీ చైర్మన్ అక్బర్ హుస్సేన్ కి తెలంగాణ ఉద్యోగుల సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం చైర్మన్ ఎ. పద్మాచారి, ప్రెసిడెంట్ ఎం. రవీంద్ర కుమార్, ప్రధాన కార్యదర్శి సి. హరీష్ కుమార్ రెడ్డి, సిటీ ప్రెసిడెంట్ ఎన్. నర్సింగ్ రావ్, చీఫ్ అడ్వాయిజర్ పి. పవన్ కుమార్ గౌడ్, జి.పద్మా ఉమెన్ వింగ్, జి.మహేశ్వర్ గౌడ్, జి.జాకబ్, ఐపీఎం ప్రెసిడెంట్ మహేష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ నిర్మల, పి.పరమేష్, టీఆరెస్ నాయకులు సైయ్యద్, సుందర్ కల్లూరి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest