హైదరాబాద్
తెలంగాణ ఎంసెట్, పీజీ సెట్ ఎగ్జామ్ షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. మార్చ్ 3 నుంచి ఎంసెట్, పీజీ సెట్ల అప్లికేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 10 వరకు ఎంసెట్ కు అప్లై చేసే అవకాశం కల్పించారు. మే 7 నుంచి 11 వరకు జరగనున్న ఎంసెట్ పరీక్ష జరుగుతుంది. మే 29 నుంచి జూన్ ఒకటి వరకు పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 30 వరకు పీజీ సెట్ కు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
