నిమ్స్ ఆసుపత్రిలో ప్రీతీ కుటుంబసభ్యులకు మంత్రి హరీష్ పరామర్శ

హైదరాబాద్
నిమ్స్ లో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రీతిని శుక్ర‌వారం వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు పరామర్శించారు.
రెండు రోజుల జిల్లా ప‌ర్య‌ట‌న ముగించుకొని శుక్ర‌వారం రాత్రి హైద‌రాబాద్ కు చేరుకున్న మంత్రి హరీష్ రావు నేరుగా నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి ప్రీతీ ఆరోగ్య పరిస్థితిని, జరుగుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. అత్యుత్తమ వైద్యం అందించాల‌ని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యుల‌ను ఆదేశించారు. ప్రీతి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చి, ధైర్యంచెప్పారు.ప్రభుత్వం అండగా ఉంటుందని భ‌రోసా ఇచ్చారు. విచారణ పూర్తి నిష్పాక్షికంగా జ‌రుగుతుంద‌ని, దోషులు ఎంత‌టివారైనా క‌ఠినంగా శిక్షిస్తామ‌ని మంత్రి హ‌రీశ్ రావు హామీ ఇచ్చారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest