హైదరాబాద్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగిన పేపర్ లీక్ వ్యవహారంలో సిట్ కాస్త దూకుడు పెంచినట్టు కనిపిస్తోంది. సర్వీస్ కమిషన్ లో పని చేస్తూ గ్రూప్ -1 పేపర్ లీక్ చేసిన ముగ్గురిని సిట్ గుర్తించింది. ఆ ముగ్గురు కూడా పరారీలో ఉన్నట్టు భావిస్తున్న సిట్ అధికారులు వారికోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ ముగ్గురు కూడా సర్వీస్ కమిషన్ లో ఉద్యోగం చేస్తున్నట్లు గుర్తించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.