ప్రీతీ కేసులో ముగిసిన సైఫ్ కస్టడీ

వరంగల్

ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు సైఫ్ కస్టడీ ముగిసింది. ఎంజీఎం లో మెడికల్ టెస్టులు ముగించుకొని కోర్టులో హాజరు పరుస్తారు.నాలుగు రోజుల కస్టడీ నిమిత్తంలో మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో విచారించారు. ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ జరిగింది.నాలుగవ రోజు కే ఎం సి ఎంజీఎం ఆసుపత్రికి విచారణ నిమిత్తం సైఫ్ ని పోలీసులు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా ప్రీతి స్నేహితులను కూడా ప్రశ్నించారు. వాట్సప్ చాట్ సాంకేతికత ఆధారంగా మొదట విచారణ ప్రారంభం అయింది. ప్రీతి సైఫ్ మధ్య ఎందుకు గొడవ వచ్చింది? ఎలా వచ్చింది? అన్న కోణంలో విచారణనూ విచారణ జరిగింది. ప్రీతితో కేవలం జూనియర్ సీనియర్ సంబంధం తప్ప మరేమీ లేదని సైఫ్ పోలీసులకు చెప్పినట్టు సమాచారం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest