ప్రెస్ క్లబ్ – 2023 డైరీ ఆవిష్కరించిన డీజీపీ

హైదరారాబాద్ ,ఫిబ్రవరి 10:

శాంతిభద్రల పరిరక్షణలో మీడియా పాత్ర కీలకమని తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ రూపొందించిన 2023 నూతన డైరీని శుక్రవారం నాడు తన కార్యాలయంలో డీజీపీ ఆవిష్కరించారు.శాంతి భద్రతల పరిరక్షణలో జర్నలిస్టులు తమకు సహరించాలని అయన సూచించారు.నూతన డైరీలోమీడియా సమాచారం పొందుపరచటం అభినందనీయమన్నారు. ప్రెస్ క్లబ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎల్.వేణుగోపాల నాయుడు,సంయుక్త కార్యదర్శులు రమేష్ వైట్ల,చిలుకూరి హరిప్రసాద్, కోశాధికారి ఏ. రాజేష్ తో పాటు ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు బి .గోపరాజు,రాఘవేందర్ రెడ్డి,టీ . శ్రీనివాస్ తదితరులు ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ ను నూతన పాలకమండలి తరపున అధ్యక్షులు వేణుగోపాలనాయుడు, పూల మొక్కను అందజేసి , శాలువులతో సత్కరించారు . ప్రెస్ క్లబ్ నూతన పాలక మండలికి డీజీపీ శుభాకాంక్షలు తెలిపారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest