హన్మకొండ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు హన్మకొండ కోర్టు బెయిలు మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. ఏ సమయంలో అయినా విచారణకు సహకరించాలని , దేశం విడిచి పెట్టి పోరాదని కోర్టు పేర్కొంది. ఇరవై వేల రూపాయల పూచికత్తుపై బెయిలు మంజూరు చేసింది. పడవ తరగతి హిందీ పేపర్ లీకేజి కేసులో బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బండిని ఏ -1 ముద్దాయిగా పోలీసులు ప్రకటించారు. 8వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో బండి సంజయ్ కు బెయిలు తప్పని సరి అని బండి సంజయ్ తరపు న్యాయవాదులు వాదించినట్టు తెలుస్తోంది. ప్రధాని వచ్చినప్పుడు ఒక ఎంపీగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పకుండా ఆ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంటుందని నయాయవాదులు విజ్ఞ్యప్తి చేసినట్టు సమాచారం. సుమారు ఎనిమిది గంటల పాటు వాదోపవాదాలు జరిగిన తరువాత షరతులతో కూడిన బెయిల్ ను హన్మకొండ కోర్టు మంజూరు చేసింది.
