హైదరాబాద్
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు అత్యంత తక్కువ రోజులు ఎందుకు నడిపారో సీఎం కెసిఆర్ చేప్పాలి అని మాజీ పీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ సమావేశాలు సుదీర్ఘంగా నడుస్తాయి
కాగ్ రిపోర్ట్ సభలో ఎందుకు పెట్టలేదు. ప్రభుత్వ తప్పులు బయటకి రాకుండా చేసిన నీచ చరిత్ర కెసిఆర్ ది .కెసిఆర్ మొన్నటివరకు బీజేపీతోనే కలసి ఉన్నారు కదా .. బీజేపీ చేసే పనులు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా .కుంభకరుడు నిజంగా ఆరు మాసాలే నిదురలో ఇప్పుడు కళ్లు తెరిచినట్లు నటిస్తున్నాడు .ఎనిమిదిన్నర సంవత్సరాలు కెసిఆర్ ఎందుకు బీజేపీ ని ప్రశ్నించలేదు .ప్రభుత్వ వెబ్ సైట్స్ పని చేస్తున్నాయా .అసెంబ్లీ ని కెసిఆర్ వేదికగా చేసుకుని కావలనే తప్పుగా మాట్లాడితే శిక్షహరుహుడే .ప్రపంచంలో దేశాని ఐదొవ ఆర్ధిక శక్తిగా చేసిన ఘనత కాంగ్రెస్ ది .ఏ ప్రాజెక్టు నుండి నీళ్ళు వచ్చి కుంటలు నిండాయి కెసిఆర్ ? వాగులు పారుతుండడం మీరు తెచ్చిన ఏ Project water తోటి ?Kaleshwaram నుండి ఇప్పటికైనా ఒక్క చుక్క నీరు అయిన వాడుకొనే పరిస్ధితి ఉందా ?కాంగ్రెస్ జలయజ్ఞం లో భాగంగా 33 ప్రొజెక్ట్స్ మొదలాయినాయి కదా ?8500 కోట్లతోటి ఆన్గోయింగ్ ప్రొజెక్ట్స్ ఎందుకు పూర్తి చెయ్యలేదు కెసిఆర్
నోట్ల రద్దు , GST కి ఎందుకు మద్దతు ఇచ్చావు కెసిఆర్ .కెసిఆర్ మాట్లాడే మాటలోని వాస్తవాలు ప్రజలకి తెలియకుండా పోతాయా.ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎందుకు ప్రారంభించలేదు కెసిఆర్ .కాంగ్రెస్ కి పేరు వస్తుందనే కదా?ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యి అన్ని దొంగ మాటలే మాట్లాడుతున్నారు .దేశంలో బీజేపీ కి వ్యతిరేకంగా కలసి వచ్చే శక్తులు ఒకచోటికి రాబోతున్నాయి. కాంగ్రెస్ ప్రజల విశ్వాసం పొందుతుంది కాబట్టే కెసిఆర్ కాంగ్రెస్ గురంచి మాట్లాడుతున్నారు. ప్రొజెక్ట్స్ గురంచి దాచుకునే వాళ్ళం అయితే ప్రొజెక్ట్స్ దగ్గర చర్చలు ఎందుకు పెట్టాం. దమ్ముంటే చర్చకు రండి .ఒక ప్రశ్నకి అసెంబ్లీలో 18 రోజులు చర్చ జరిపిన చరిత్ర కాంగ్రెస్ ది .కాళేశ్వరం ప్రాజెక్ట్ పై చర్చకు వస్తారా .కెసిఆర్ చర్లపల్లి జైలుకే పోతాడు.. అక్కడ కెసిఆర్ కళ్ళు కూడా తెరవడు అని లక్ష్మయ్య అన్నారు.