బాత్రూం వెళ్ళలేని డీఎస్ గాంధీ భవన్ కు… అరవింద్ జీర్ణించుకోలేకపోతున్నారా?

హైదరాబాద్
బాత్రూం వెళ్ళలేని పరిస్థితిలో గాంధీ భవన్ తీసుకుని వెళ్ళడం మా తల్లి బాదపడింది అని అంటున్నాడు డీఎస్ సుపుత్రుడు , నిజామాండ్ ఎంపీ ధర్మపురి అరవింద్. బి ఆర్ ఎస్ నుంచి బయటికి వచ్చిన డీఎస్ కు గాంధీ భవన్ కు కాకుండా గాంధీ భవన్ కు ఎదురుగా ఉన్న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవనానికి వెళ్లనందుకు ఆరవింద్ తెగ బాధపడిపోతున్నట్టు ఉంది. అరవింద్ కామెంట్స్ అంటూ సోషల్ మీడియాలో ప్రకటన చక్కర్లు కొడుతోంది.
”డి.శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి బాగలేదు..ఈ సమయంలో కాంగ్రెసు పార్టీలో చేర్చుకోవడం పద్దతి కాదు.బాత్రూం వెళ్ళలేని పరిస్థితిలో గాంధీ భవన్ తీసుకుని వెళ్ళడం మా తల్లి బాదపడింది.డి.శ్రీనివాస్ కటారి కాంగ్రెసు… నేను కట్టర్ బీజేపీ.45 ఎండ్ల కాంగ్రెసు పార్టీకి డి శ్రీనివాస్ సేవ చేశారు. ఆరోగ్యం బాగలేని సమయంలో సోనియా గాంధీ ఫోన్ చేయలేదు. సోనియా గాంధీకి కూతురు, కుమారుడు లాంటి వాళ్ళ ఇంటికి వచ్చి పార్టీ చేర్చుకుంటే పద్దతి. నేను బీజేపీ చేరిన సమయంలో మా నాన్న కాంగ్రెసు పార్టీలో లేరు.కాంగ్రెసు వాళ్ళే డి శ్రీనివాస్ పార్టీ నుంచి వెళ్ళకొంటారు. డి శ్రీనివాస్ రాజకీయనికి..నా రాజకీయనికి సంబందం లేదు” అని వ్యాఖ్యానించారు. అయితే ఈ ప్రకటనలో కనిపించింది ఏమిటంటే గాంధీ భవన్ కు తెలంగాణ నాయకులూ తీసుకునివెళ్ళడం బహుశా అరవింద్ కు నచ్చలేదనుకుంటా. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆయన ఇంటికి వచ్చి పిలవాలట. కాంగ్రెస్ తో బాగుపడ్డ డీఎస్ కాంగ్రెస్ ద్రోహం చేసి టి ఆర్ ఎస్ కు వెళ్ళినటువంటి వ్యక్తి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇంటికి వచ్చి పిలుస్తారా? ఆయనే వెళ్లారు ? ఆయనే వచ్చారు ? అని గాంధీ భవన్ లో చర్చ జరుగుతోంది.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest