హైదరాబాద్, మార్చి 16 : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనే డిమాండ్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ శుక్రవారం ఉదయం 10.30 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టనున్నారు.అంతకుముందు ఉదయం 10 గంటలకు బండి సంజయ్ నాంపల్లిలోని గన్ పార్క్ వద్దకు వెళ్లి అమరవీరులకు నివాళులు అర్పిస్తారు.
