మంత్రిని కలిసిన సఖి మహిళలు

హైదరాబాద్

హైదరాబాద్ బంజారా హిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో తెలంగాణ రాష్ట్రలోని 33 జిల్లాల సఖి సెంటర్ల సిబ్బంది రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. సఖి సెంటర్ ఇంప్లిమెంటేషన్ లో ఉన్న ఇబ్బందులను సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుతూ మంత్రి గారికి సఖి సిబ్బంది వినతి పత్రం అందజేశారు. అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి మార్చి నెలలోపు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి కొత్త పద్ధతిలో సఖి సెంటర్లను ఇంప్లిమెంటేషన్ చేయటానికి ఆలోచన చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్లు డి.లక్ష్మి, వి.శ్రీలత, ఏ.గాయత్రి, మంజుల, రోజా, లావణ్య, భారతి, శ్రావణి, మందాకిని, రేణుక, అనిత రెడ్డి, సుశీల,మరియు సోషల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచిన మంత్రి
క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని మంత్రి సత్యవతి రాథోడ్ గారు స్పష్టం చేశారు. కేసీఆర్ కప్ 2023″ రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను హైదరాబాద్ లోని ఎల్బి స్టేడియం లో మంత్రి ప్రారంభించారు. వాలీబాల్ ఆడి క్రీడాకారులను మంత్రి ఉత్సాహపరిచారు. యువత క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్రీడలకు ప్రాధాన్యతను ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దారుధ్యానికి దోహదపడతాయని తెలిపారు. వివిధ ప్రాంతాల సాంస్కృతి సాంప్రదాయాలను ఈ క్రీడలు ఒకటి చేస్తాయని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో క్రీడలను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్సీ కవితను మంత్రి అభినందించారు. ఈడాది విజేతలకు ప్రైజ్ మనీ పెంచడం జరిగిందన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి హాజరైన పురుషుల మరియు మహిళల విభాగాలలో ఈ టోర్నమెంట్ జరగనుందని, విజేతలలో
మొదటి బహుమతి – ట్రోఫీ మరియు 100,000 రూపాయల నగదు,
ద్వితీయ బహుమతి ట్రోఫీ మరియు రూ. లు 75 వేలు.
తృతీయ బహుమతి ట్రోఫీ మరియు రూ. లు 50 వేలు.
నాలుగవ స్థానం – ట్రోఫీ మరియు రూ. లు 25 వేలు.
పై బహుమతులు పురుషుల మరియు మహిళల విభాగాలలో విడివిడిగా ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు, భారత జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest