హైదరాబాద్ :
మార్చి 3న ఆదిలాబాద్, బాసర లో హాత్ సే హాత్ జోడో యాత్ర కొనసాగుతుందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి చెప్పారు. గాంధీ భవన్ లో సోమవారం మీడియాతో మాట్లాడారు. హాత్ సే హాత్ జోడో యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది.మార్చ్ 3 న ఆదిలాబాద్ ,బాసరలో పాదయాత్ర మొదలు పెట్టి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తాం.బాసరలో పూజలు చేసి బైంసా నుంచి పాదయాత్ర మొదలు పెడతాం.రాష్ట్ర ముఖ్యనాయకులంతా ఈ పాదయాత్ర లో పాల్గొంటారు.కాంగ్రెస్ తెలంగాణ పోరు యాత్ర పేరు తో ఈ పాదయాత్ర చేయబోతున్నాం.మొదట 10 రోజులు పాదయాత్ర ఉంటుంది.ప్రతీ నియోజకవర్గంలో 1,2 రోజుల పాదయాత్ర ఉంటుంది. హైదరాబాద్ గాంధీ భవన్ లో ముగింపు కార్యక్రమం ఉంటుంది.
Post Views: 56