మీడియా బ్యూరో చీఫ్ లతో భట్టి భేటీ

హైదరాబాద్ , మార్చి 15 :

హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా ఈ నెల 16 వ తేదీ (గురువారం ) నుంచి సి ఎల్ పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని పిప్పిరి అనే గిరిజన గ్రామం నుంచి ఆయన కాలినడకన పాదయాత్ర చేస్తున్నారు. అయితే బుధవారం సాయంత్రం పార్క్ హయత్ హోటల్ లో మీడియా బ్యూరో చీఫ్, ఇన్ ఫుట్ ఎడిటర్ లతో భట్టి భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు ఈ భేటీ సాగింది. ఎందుకు తాను పాదయాత్ర చేస్తున్నాను. కేసీఆర్ చేసిన తప్పులు ఏమిటి ? కాళేశ్వరంతో కేసీఆర్ ఎం చేశారు? కేసీఆర్ ఇప్పటి వరకు ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా కట్టలేదు. వంటి అంశాలను మీడియా బ్యూరో చీఫ్ లతో పంచుకున్నారు. పిప్పిరి నుంచి ఖానాపూర్ మీదుగా యాత్ర సాగుతుందని అన్నారు. పాదయాత్ర చెయ్యడం వల్ల సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని భట్టి అభిప్రాయపడ్డారు. అయితే రేవంత్ రెడ్డి కారులో తిరిగారు కదా? అని ఒకరు ప్రశ్నించగా ఆయన దారి ఆయనది. మనదారి మనది అని వ్యాఖ్యానించారు. వచ్చిన పది పన్నెండు మంది బ్యూరో చీఫ్ లలో సగం మంది ఆంధ్ర వాళ్ళే ఉండటం గమనార్హం.
రేవంత్ కు వ్యతిరేకంగా !
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి యాత్ర ఉమ్మడి కరీం నగర్ జిల్లా వరకే సాగింది. ఉమ్మడి కరీం నగర్ జిల్లాలో భారీ బహిరంగ సభ పెట్టిన తరువాత కరీం నగర్ ను ఆనుకుని ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ లో ప్రవేశించలేదు. కారణం ఆ జిల్లా నేతలెవరూ రేవంత్ యాత్ర కు సహకరించలేదని మాట వినిపిస్తోంది. మంచిర్యాల జిల్లాకు చెందిన మాజీ ఎం ఎల్ సి ప్రేమ్ సాగర్ రావు , నిర్మల్ చెందిన మహేశ్వర్ రెడ్డి గాని రేవంత్ యాత్రను ఆవహ్యానించలేదని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. రేవంత్ కు వ్యతిరేకంగా భట్టిని పాదయాత్ర కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలు సై అన్నట్టు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అయితే మీడియా బ్యూరో చీఫ్ లతో అంతసేపు ముచ్చటించి ఖాళి చేతులతో పంపించారనే గుసగుసలు కూడా వినిపించాయి.

అయితే మీడియా బ్యూరో చీఫ్ లతో అంతసేపు ముచ్చటించి ఖాళి చేతులతో పంపించారనే గుసగుసలు కూడా వినిపించాయి.

 

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest