హైదరాబాద్ :
తొలివెలుగు అనేది ఒక యూట్యూబ్ ఛానల్. ఇంతకాలం ఈ ఛానల్ ను నడిపించింది సీనియర్ జర్నలిస్ట్ రవి ప్రకాష్ అని అక్కడ పని చేసే వాళ్ళు చెప్పారు. రవి ప్రకాష్ నడిపించిన తొలివెలుగును ఇటీవల కేటీఆర్ కు అమ్మేశారని మీడియా కోడై కూస్తోంది. ఇదే విషయాన్నీ తొలివెలుగు యాంకర్ గా పని చేసిన రఘు అనే వ్యక్తి ఇప్పుడు చెప్తున్నాడు. కేటీఆర్ కు రవి ప్రకాష్ అమ్ముడు పోయాడు కాబట్టి తాను ఆ ఛానల్ నుంచి బయటికి వచ్చాను , కేటీఆర్ కూడా ఫోన్ చేసి మాట్లాడిన తాను అక్కడికి వెళ్ళలేదు అని రఘు వివిధ యూట్యూబ్ ఛానెల్స్ కు ఇచ్చిన ఇంటర్వూ లో పేరొన్నారు. అయితే తొలి వెలుగు లో తన రక్తం ధారపోశానని అందుకే తన వాటా తాను అడుగుతున్నానని రఘు అంటున్నాడు. అయిదు కోట్లు అడిగిన రఘు ఇప్పుడు రెండు కోట్లకు దిగివచ్చారని మీడియాలో వినిపిస్తున్న మాట.
అయితే ఇప్పుడు రఘు అనే వ్యక్తి తొలి వెలుగు పేరుతో తాను సొంతగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాడు. దీనికి ”మన” అని రెండు చిన్న అక్షరాలు ఎక్కడ సరిగ్గా కనిపించకుండా పెట్టాడు. ”మన తొలివెలుగు ” ఛానల్ పేరుతో రఘు జనం ముందుకు వస్తున్నాడు.
రఘు తన కెరీర్ ప్రారంభంలో జీ 24 గంటలు ఛానల్ లో ట్రైనీ యాంకర్ గా పని చేశాడు. ఆ తరువాత 10టీవీ లాంటి చానెల్స్ లోనూ యాంకర్ గా పని చేశాడు. రఘు ఎక్కడా కూడా రిపోర్టింగ్ సైడ్ పని చేసిన దాఖలాలు లేవు. అయితే యాంకర్ కాబట్టి స్రీన్ మీద మాట్లాడటం అలవాటే. వివిధ ఛానల్స్ లో యాంకర్ గా పని చేసిన రఘు ఆ తరువాత రవి ప్రకాష్ దగ్గర చేరాడు. తొలివెలుగులో కూడా ఆయన చేసిన పని యాంకర్ పనే. అయితే జర్నలిస్ట్ గా రూపాంతరం చెందాడు.
రఘు వెనుక బీజేపీ !
తొలివెలుగు నుంచి బయటికి వచ్చి మన తొలివెలుగు పేరుతో యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించిన రఘు గంజి వెనుక బీజేపీ ఉందనే విషయం ఇక్కడ స్పష్టమవుతోంది. రవి ప్రకాష్ బి ఆర్ ఎస్ పంచన చేరిన నేపథ్యంలో రఘు బీజేపీ పంచన చేరినట్టు కనిపిస్తోంది. రఘు మన తొలివెలుగు పేరుతో ఛానల్ ప్రారంభించినట్టు తీన్మార్ మల్లన్న చెప్తున్నాడు. ఇదే వేదికపై మాజీ ఎంపీ, బీజేపీ నేత విశ్వేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. దీనిబట్టి చూస్తే రఘు పెట్టిన మన తొలి వెలుగు ఛానల్ వెనకాల బీజేపీ అండ ఉందని స్పష్టమవుతోంది. ఇప్పటికే తీన్మార్ మల్లన్న బీజేపీ లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం బీజేపీలో ఉన్నదో లేదో కూడా స్పష్టత లేదు.
టివి 9 ఛానల్ లో వర్కింగ్ పార్ట్నర్ గా ఉన్న రవి ప్రకాష్ గొడవ జరిగినప్పుడు బయటికి వచ్చి టివి 9 మీద ఏ విధంగా తనకు హక్కులు ఉన్నాయని అరిచారో అదే సీన్ తొలివెలుగు లో రిపీట్ అవుతోంది. తొలివెలుగు ఛానల్ లో రఘు ఎలాంటి పార్ట్నర్ కాకపోయినా తన వాటా అడుగుతున్నాడని తొలివెలుగు కు సంబధించిన టీమ్ వాపోతోంది. మరి ఇప్పడు రఘు మన తొలివెలుగుతో ఏం చేస్తాడో చూద్దాం.