రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం

హైదరాబాద్

రాష్ట్ర చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగం( Power consumption ) నమోదైంది.ఉదయం 11:01 గంటలకు గరిష్ఠంగా 15,497 మెగావాట్ల డిమాండ్ నమోదైంది.ఈ నెల ప్రారంభం నుంచే 15 వేల మెగావాట్ల విద్యుత్( Power ) వినియోగం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.విద్యుత్ వినియోగంలో దక్షిణాదిన తెలంగాణ( Telangana ) రెండో స్థానంలో ఉంది.మార్చి 14వ తేదీన(మంగళవారం) ఉదయం 10:03 గంటలకు 15,062 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం జరిగినట్లు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు వెల్లడించిన సంగతి తెలిసిందే. సరిగ్గా రెండు వారాల తర్వాత గురువారం ఉదయం 11:01 గంటలకు 15,497 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైంది.సాగు విస్తీర్ణం పెరగడం,రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలు పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతుంది.మొత్తం విద్యుత్ వినియోగం లో 37 శాతం వ్యవసాయ రంగంకే.దేశంలో వ్యవసాయ రంగం కు అత్యధిక విద్యుత్ వినియోగం చేస్తున్న రాష్ట్రం తెలంగాణమొత్తం విద్యుత్ వినియోగం లో దక్షిణ భారతదేశంలో తమిళనాడు మొదటి స్థానం కాగా రెండో స్థానం లో తెలంగాణ.గత సంవత్సరం మార్చి నెలలో 14160 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం కాగా ఈసారి డిసెంబర్ నెలలోనే గత సంవత్సరం రికార్డ్ ను అధిగమించి ఈనెలలోనే 14750 మెగా వాట్ల ఫీక్ విద్యుత్ వినియోగం దాన్ని అధిగమించి 15254 మెగా వాట్ల ఫీక్ డిమాండ్ నమోదు అయింది.ఈ సంవత్సరం వేసవి కాలంలో 16 వేల మెగా వాట్ల డిమాండ్ వచ్చే అవకాశం ఎంత డిమాండ్ వచ్చిన సరఫరా కు అంతరాయం లేకుండా సరఫరా చేస్తాం.మార్చి నెలలో 15000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అవుతుంది అని ముందే ఉహించాం అందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరా కు ఏర్పాట్లు చేశాం.రాష్ట్ర రైతాంగంకు,అన్ని రకాల వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తాం.

నిరవధిక సమ్మెకు సిద్ధమైన విద్యుత్ ఉద్యోగులు

PRC అమల్లో జాప్యానికి నిరసనగా ఏప్రిల్ 17 నుంచి నిరవధిక సమ్మెకు దిగాలని విద్యుత్ ఉద్యోగ సంఘాల JAC నిర్ణయం. సమ్మె నోటీసు ఇచ్చే అవకాశం. PRCపై JAC నేతలతో విద్యుత్ సంస్థల CMDలు ప్రభాకరరావు, రఘుమారెడ్డి చర్చలు. వేతనాలను 30 శాతం పెంచాలని ఉద్యోగులు డిమాండ్. ఆర్థిక ఇబ్బందులతో 6 శాతం మించి పెంచలేమన యాజమాన్యం. రాష్ట్రంలో ఇప్పటికే విద్యుత్ సంస్థల్లో 30,956 మంది ఉద్యోగులు, మరో 20,201 మంది తాత్కాలిక ఉద్యోగులు 20,500 మంది పింఛను దారులు ఉన్నారు వీరందరికీ కూడా 2022 ఏప్రిల్ ఒకటో నుంచి కొత్త పిఆర్సి అమలు చేయాలని విద్యుత్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest