రాహుల్ పై తప్పుడు కేసు

ఆసిఫాబాద్ :

తప్పుడు కేసులు పెట్టి, గుజరాత్, సూరత్ కోర్టులో రెండు సంవత్సరాల జైలు శిక్ష పడేలా చేశారని తెలంగాణ సి ఎల్ పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పాదయాత్రలో ఉన్న భట్టి రాహుల్ గాంధీ విషయంపై మాట్లాడారు. కోర్టు ఇచ్చిన తీర్పులోనే హైకోర్టుకు వెళ్లడానికి నెల రోజులు సమయం ఇచ్చినప్పటికీ లోక్ సభ స్పీకర్ ఆ నెల రోజులు ఆగకుండా రాజ్యాంగ స్ఫూర్తిని పరిగణలోకి తీసుకోకుండా పార్లమెంటు నుంచి బహిష్కరణ చేయడం రాజ్యాంగ విరుద్ధం అని ఆయన అన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ న్యాయపోరాటంతో పాటు ప్రజా పోరాటం కూడా చేస్తుందని ఆయన చెప్పారు.

పెద్దపల్లి జిల్లాలో నిరసన

పెద్దపల్లి పట్టణ కేంద్రంలో కమాన్ చౌరస్తా వద్ద రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసినందుకు నిరసనగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట విజయరమణ రావు ఆధ్వర్యంలో నిరసన తెలిపి, రాస్తా రోకో చేసి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్దం చేయడం జరిగింది.

రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వ రద్దు చేయడం ప్రజాస్వామ్యనికే చీకటి రోజు: జీవన్ రెడ్డి కామెంట్స్

ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారనడానికి ఇదే నిదర్శనం.రాహుల్ గాంధీకి అండగా యావత్ భారత దేశం నిలుస్తోంది.కోసం కులాల పేరిట మతాల పేరిట చీల్చాలని ప్రయత్నం చేస్తుంటే రాహుల్ గాంధీ భారత జాతిని ఏకం చేసేందుకు భారత జోడో యాత్ర చేపట్టారు.కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఎవరినైనా వ్యక్తిగత కక్షలతో ఏ విధంగా ఇబ్బందులకు గురిచేస్తారో చెప్పడానికి రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు నిదర్శనం అన్నారు.భారతదేశంలోని రాహుల్ గాంధీ అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలుపొందారు

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest