రైతు ఆత్మ హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే:ఎమ్మెల్యే సీతక్క

ములుగు
అప్పుల భాదతో ఆత్మ హత్య చేసుకున్న కౌలు రైతు కీసర రాజు కుటుంబాన్ని పరామర్శించి 5వేల ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.
ములుగు మండలం లోని రామచంద్ర పూర్ గ్రామానికి చెందిన కౌలు రైతు కీసర రాజు పురుగుల మందు తాగి ఆత్మ హత్య చేసుకోగా వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించి 5 వేల ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీతక్క
రైతులు మద్దతు ధర లేక అప్పుల బాధలు తట్టుకొ లేక పురు గుల మందులు తాగి ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటుంబాలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు ఆత్మ హత్య చేసుకున్న కౌలు రైతు కీసర రాజు ఏటా 10 ఎకరాలు కౌలుకు భూమి సాగు చేస్తూ తీవ్రంగా నష్టపోయి అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే ముఖ్య మంత్రి కెసిఆర్ గారు రైతు ఆత్మ హత్యాలలో రెండవ స్థానం లో ఉన్నది మరిచారా?
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతు కుటుంబానికి తగు న్యాయం చేయాలని మృతుని కుటుంబానికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అని సీతక్క గారు అన్నారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి,కిసాన్ సెల్ మండల అధ్యక్షులు వాకిటి రామ కృష్ణ రెడ్డి,సహకార సంఘం చైర్మన్ బొక్క సత్తి రెడ్డి,ఫిషర్ మెన్ మండల అధ్యక్షులు సాధం సాంబయ్య,
యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,మాజీ మండల అధ్యక్షులు కొంపెల్లీ శ్రీనివాస్ రెడ్డి,కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కరివేద రాజీ రెడ్డి,గ్రామ కమిటీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, గందే శ్రీను,స్థానిక నాయకులుమార్కండేయ,ఎండీ హైమద్ పాషా,పోరిక ప్రమీల, తదితరులు ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest