రైల్వే గేట్ సమీపంలో బిజెపి దీక్ష

హైదరాబాద్:

నేరెడ్మెట్ వాజ్ పేయి నగర్ ఆర్.యు.బి పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బిజెపిన పార్టీ నాయకులు ఈరోజు వాజిపేయి నగర్ రైల్వే గేట్ సమీపంలో ఒకరోజు నిరాహార దీక్ష కు కూర్చున్నారు. ప్రతినిత్యం విపరీతమైన ట్రాఫిక్ తో ఉండే ఈ ప్రాంతంలో ఆర్.యు.బి ని ఏర్పాటు చేయాలని పలు దశాబ్దాలుగా ఇక్కడ ప్రజలు, పలు రాజకీయ పార్టీలు పోరాటం చేస్తున్నాయి. ఈ పోరాట ఫలితంతో 2014 సంవత్సరంలో రైల్వే శాఖ ఆర్.యు.బి కి అనుమతి ఇచ్చింది. కానీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో గత ఎనిమిదేళ్లుగా ఇక్కడ ఆర్.యు.బి పనులు ప్రారంభానికి నోచుకోలేదు. వెంటనే ఆర్.యు.బి పనులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి రాష్ట్ర ప్రభుత్వంపై పలు పార్టీలు పోరాటం చేస్తున్నాయి. దీనిలో భాగంగా బిజెపి పలు సంవత్సరాలుగా ఇక్కడ పోరాటం చేస్తుంది. ఈరోజు బిజెపి ఆధ్వర్యంలో వాజిపేయి నగర్ రైల్వే గేట్ వద్ద నిరాహార దీక్షకు కూర్చున్నారు. బిజెపి నాయకుడు బక్కా నాగరాజు అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, స్థానిక కార్పొరేటర్లు రాజ్యలక్ష్మి,సునీతా యాదవ్, శ్రావణ్ , బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. వాజిపేయి నగర్ లో ఆర్.యు.బి పూర్తి అయ్యేవరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ఈ సందర్భంగా పలువురు నాయకులు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest