లీకేజీ వ్యవహారంలో పాలకులకు సంబంధం

హైదరాబాద్

యువజన సమితి, విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో, “టీఎస్పీఎస్సి పేపర్ల లీకేజీ ప్రభుత్వ వైఫల్యం- నిరుద్యోగుల గోస” రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి YJS అధ్యక్షులు సలీం పాషా, VJS అధ్యక్షులు సర్దార్ వినోద్ కుమార్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్బంగా కాంగ్రెస్ మాజీ ఎంపీ డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చివరి దశకు వచ్చాయి అనుకుంటున్న.నోటిఫికేషన్లు పేరుతో ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది.ఇద్దరు వ్యక్తుల మీద నెట్టేసి ప్రభుత్వం బాధ్యత నుండి తప్పించుకుంటుంది.రాష్ట్ర సమస్యను పక్కన పెట్టి లిక్కర్ కేసులో ఇరుక్కున్న కవిత కోసం ఢిల్లీలో మకాం.వేశారు.ఐటీ మంత్రి అయి ఉండి కేటీఆర్ సంబంధం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు.చట్ట ప్రకారం పాలన జరుగకుంటే ఆ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం.బిఅరెస్ ప్రభుత్వం చెప్పేవన్ని మాయమాటలే.రాష్ట్రంలో ప్రశించే గొంతును లేకుండా చేస్తున్నారు.రాష్ట్రంలో పరిపాలన యంత్రాంగం గాడి తప్పింది.ప్రజలకు వ్యతిరేకంగా పాలన చేస్తున్నారు అని దుయ్యబట్టారు.

టి జె ఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం ఇద్దరు వ్యక్తుల సమస్య కాదు, పాలకులకు సంబందం ఉంది. నిరుద్యోగులకు అయిన నష్ట పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ప్రశ్నపత్రం లీకేజీపై సిట్టింగ్ హైకొర్డు జడ్జితో విచారణ జరిపించాలి. లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ దే. 30లక్షల మంది నిరుద్యోగులతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది. ప్రభుత్వ అరాచాకాలపై ఐక్యంగా ఉద్యమిస్తాం. కేసీఆర్ పైస గెలుస్తుందా?మా పోరాట పటిమ గెలుస్తుందా చూద్దాం. ఇక ఐక్యంగా ఉద్యమిస్తాం… కేసీఆర్ కాస్కో త్వరలో అన్ని పార్టీలతో సమావేశమై మా కార్యాచరణ ప్రకటిస్తాం.

ప్రొ. హరగోపాల్ మాట్లాడుతూ సీఎం ఒక్కడే తెలంగాణ సాధించినట్లు చెప్పడం ఆయనకు చరిత్ర తెలియకప్పవడమే.మంచి జరిగితే తన అకౌంట్ లో చెడు జరిగితే ఇతరుల పై వేయడం సరైంది కాదు.30 లక్షల నిరుద్యోగుల సమస్య పై సీఎం ఎందుకు స్పందించడం లేదు.తెలంగాణ లో పోరాట స్ఫూర్తి పోయింది ఏం చేసినా నడుస్తోందని ప్రభుత్వం అనుకుంటోంది.ఉద్యోగస్తుడిని సస్పెండ్ చేయడం చాలా చిన్న విషయం నిరుద్యోగులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు.రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య వెంటాడుతోంది. టీఎస్పీఎస్సి పేపర్ లీక్ కు ఎవరు బాద్యులో సీఎం కేసీఆర్ చెప్పాలి

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ వేదనతో కుమిలిపోతోంది.నిరుద్యోగ సమస్యను పాలకులు పట్టించుకోవడం లేదు.ఎప్పుడు వస్తాయో తెలియని నోటిఫికేషన్లు కోసం కోచింగ్ సెంటర్లకు లక్షల రూపాయలు పోస్తున్నారు.ఆడిషినల్ అద్వకేట్ జనరల్ లిక్కర్ కేసు విషయంలో కవిత దగ్గరికి ఎలా పోతారు.చైర్మన్ దగ్గర ఉండాల్సిన పాస్ వర్డ్ ఎంత మంది దగ్గర ఉంటది.ఇంతపెద్ద విషయాన్ని చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.పేపర్ లీకులకు సంబందించిన మూలాలు సీఎం కార్యాలయంలో నే ఉన్నాయి.కేటీఆర్ ప్రెస్ మీట్ పోలీసులకు, సిట్ అధికారులకు ఇద్దరు మాత్రమే ఉన్నట్లుగా చెప్పాలని వార్నింగ్ ఇచ్చినట్లుగా ఉంది.అందరి తెలంగాణకోసం మరో పోరాటం అవసరం.బలమైన ఐక్య వేదిక ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే వి6 ను ఎలా బ్యాన్ చేస్తారురాష్ట్రంలో గడీల పాలన పోవాలి.సిబిఐ తో మాత్రమే విచారణ చేయాలి.తెలంగాణ ను దోచుకున్న ప్రతి ఒక్కరు చంచల్ గూడ జైల్ కు పోవాల్సిందే అని అన్నారు.

మాజీ ఐ ఎస్ ఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ టీఎస్పీఎస్సి రిక్రూట్మెంట్ ఇలా ఉంటే మిగతా డిపార్ట్ మెంట్ లో రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. లక్షల మంది విద్యార్థులు గోసను ప్రభుత్వం గాలికొదిలేసింది. నలుగురు తెలంగాణకు శని లాగా పట్టుకున్నారు.అన్ని రకాల పరీక్షలను ఒకే గొడుగు కిందకు తీసుకు రావాలి.రాజకీయ ప్రమేయం లేని వారిని టీఎస్పీఎస్సి లో ఛైర్మెన్ తో పాటు సభ్యులుగా నియమించాలి అని డిమాండ్ చేశారు

తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడు అంబటి నాగన్న మాట్లాడుతూ కనీసం ఇంటర్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించడం లేదు.తెలంగాణ రాష్ట్రంలో 5 వేల మంది ఇంటర్ విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారు.వందకు వంద శాతం జనార్దన్ రెడ్డి కు లీకు తో సంభందం ఉంది.జనార్ధన్ రెడ్డి ని వెంటనే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో TJS ఉపాధ్యక్షులు PL విశ్వేశ్వర రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు థర్మార్జూన్, బైరీ రమేష్, కాంగ్రెస్ నాయకులు కిరణ్ రెడ్డి, భూపతి రెడ్డి, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు గోవర్ధన్, జాన్సి, ప్రవీణ్, విద్యార్థి సంఘాల నాయకులు మహేష్ pdsu, నాగేష్వార్ రావు PDSU, పుట్ట లక్ష్మన్ AISF, OU Jac శ్రీహరి, దయాకర్, నిరుద్యోగులు సంగం నవీన్,CDpo అభ్యర్థులు, వాణి, కీర్తి, రాజమని , గ్రూప్ – 1 అభ్యర్థులు నరేష్, నిరుద్యోగ విద్యార్థులు బసoత్ మోతీలాల్, నరహరి గౌడ్ VJS, YJS నాయకులు రవి, అరున్, విరన్న, ప్రశాంత్, నరేందర్ మరియు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులు, TJS రాష్ట్ర, జిల్లా బాధ్యులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest