హైదరాబాద్ :
ఆదివారం నాడు ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే గాంధీ భవన్ లో పలు సమావేశాలలో పాల్గొన్నారు.మొదట ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ, కన్వీనర్ అజమతుల్లా హుసేన్ తదితరులతో సమావేశమయ్యారు. అనంతరం టీపీసీసీ ఓబీసీ విభాగం కార్యవర్గ సమావేశం చైర్మన్ నూతి శ్రీకాంత్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావిద్ తదితరులు పాల్గొన్నారు.తర్వాత టీపీసీసీ మైనారిటీ సెల్ చైర్మన్ సోహైల్ అధ్యక్షతన మైనారిటీ సెల్ కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం టీపీసీసీ ఎస్సి సెల్ విభాగం సమావేశం చైర్మన్ ప్రీతమ్ అధ్యక్షతన జరిగింది.
Post Views: 42