- కాంగ్రెస్ ఎం.పీ. ఉత్తం కుమార్ రెడ్డి ఊహాజనిత వ్యాఖ్యలు
- రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
హైదరాబాద్
రాష్ట్రంలో ఈనెలాఖరు వరకు శాసనసభ రద్దయి రాష్ట్రపతి పాలన వస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎం.పీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు తాను ఊహించుకుని మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.విలేకరులు అడిగిన ప్రశ్నలకు వినోద్ కుమార్ సమాధానమిస్తూ.. అసలు శాసనసభ ఎందుకు రద్దు అవుతుందని ప్రశ్నించారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఊహాజనిత వ్యాఖ్యలకు విలువలేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ శాసనసభ రద్దు అయ్యే అవకాశం లేదు అని, అలాంటప్పుడు రాష్ట్రపతి పాలన ఎక్కడి నుంచి వస్తుంది అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.ప్రజాస్వామిక వ్యవస్థలో ఊహాజనిత వ్యాఖ్యలకు తావు లేదని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
Post Views: 47