సంగారెడ్డి కలెక్టరేట్లో CPR శిక్షణ శిబిరం

 

సంగారెడ్డి జిల్లా:
ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సీపీఆర్ పై అవగాహన కల్పించాలని, శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు.సడెన్ కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ రెండూ ఒకటే అని చాలా మంది అనుకుంటారు. కాని వైద్యనిపుణులు చెబుతున్న దాని ప్రకారం, అవి రెండూ వేర్వేరు.సడెన్ కార్డియాక్ అరెస్ట్.. అంటే అనుకోని ప్రమాదాలు, దుర్ఘటనలు జరిగినప్పుడు మనిషి సైక్లాజికల్ షాక్సికి గురవుతాడు. ఈ సమయంలో హృదయ స్పందనలో తేడా వస్తుంది. గుండెలయ తప్పి ఆగిపోతుంది.ఈ సమయంలో మనిషి స్పందించడు, శ్వాస ఆగిపోతుంది. ఆ సమయంలో గుండె కొట్టుకునేలా ఛాతి మీద పదే పదే ఒత్తిడి చేయడం, నోటి ద్వారా కృత్రిమ శ్వాసను అందించడం వల్ల గుండె మరియు ఊపిరితిత్తులు తిరిగి పని చేస్తాయి.ఇంత చేసినా కొన్ని సార్లు గుండె స్పందించదు ఆ సమయంలో ఆటోమేటిక్ ఎక్స్ టర్నల్ డెఫిబ్రిలేటర్స్ (ఏఈడీ) అనే వైద్య పరికరం ద్వారా ఛాతి నుంచి గుండెకు స్వల్ప మోతాదులో ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం ద్వారా గుండె తిరిగి పని చేసేలా చేయడం సాధ్యమవుతుంది.సిపిఆర్ తెలిసిన వారు ఉంటే సీపీఆర్ చేసి వారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది.ప్రాణాపాయంలో ఉన్న వారికి సీపీఆర్ చేసేందుకు చదువు అవసరం లేదు. మెడికల్ పరిజ్ఞానం అవసరం లేదు. వయస్సుతో సంబంధం లేదు. ఎవ్వరైనా సిపిఆర్ చేసి ప్రాణాన్ని కాపాడవచ్చు. దీని మీద సమాజంలో అవగాహన లేదు. ఎవరూ దృష్టి సారించడం లేదు. ఇది కూడా ప్రాథమిక చికిత్సలో భాగమే.ఇందులో భాగంగా, పారామెడికల్ సిబ్బందితో పాటు, వైద్యు సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పోలీసు, కమ్యూనిటీ వాలంటీర్లు, ఉద్యోగులు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ల ప్రతినిధులు, సిబ్బంది, కమర్షియల్ కాంప్లెక్స్ వర్కర్స్ ఇలా వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులకు సిపిఆర్ మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.ఇందుకు గాను ప్రతి జిల్లాకు 5 మాస్టర్ ట్రైనర్ను ఏర్పాటు చేసుకుంటున్నాం.ప్రతీ మాస్టర్ ట్రైనర్ రోజుకు 3 బ్యాచుల చొప్పున 60 మందికి మొత్తంగా వారానికి 300 మందికి శిక్షణ ఇవ్వబోతున్నారు.దీని కోసం రూ. 15 కోట్లతో అవసరమైన 1262 ఏఈడి మిషన్లు ప్రొక్యూర్ చేసుకోని, అన్ని సిహెచ్సిలు, యూపీహెచ్సీలు, బస్తీ దవాఖానల్లో ఏర్పాటు చేయబోతున్నాం.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest