సమకాలిన ప్రపంచాన్ని యువత అర్థం చేసుకోవాలి

 

  • శాంతి, సంఘీభావంతో జీవించాలి
  • రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

హైదరాబాద్

సమకాలిన ప్రపంచాన్ని యువత అర్థం చేసుకోవాలని, రాజకీయ ఆర్థిక, సాంస్కృతిక, ఇతర సామాజిక అంశాలపై యువత అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.శనివారం వనస్థలిపురంలోని ‘ ఎం ‘ గ్రాండ్ హోటల్లో జరిగిన అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం తెలంగాణ రాష్ట్ర తృతీయ మహాసభలో వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ కులాలు, మతాల పేరిట మనుషుల మధ్య వైశమ్యాలను పెంచుతున్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు, ముఖ్యంగా యువతకు పిలుపునిచ్చారు.మనుషుల మధ్య ఆర్థిక వైశ్యామ్యాలు లేని మానవ సమాజం కోసం యువత కంకణం కట్టుకోవాలని వినోద్ కుమార్ అన్నారు. శాస్త్ర విజ్ఞానం మానవత్వానికి పరిష్కారం చూపుతోందని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు.దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని, సామాజిక, రాజకీయ అంశాలపై సామాజిక కోణంలో తమ వంతు పాత్రను పోషించాలని వినోద్ కుమార్ సూచించారు.ప్రజలందరూ శాంతి సౌఖ్యాలతో జీవించాలని, అల్లర్లు, వైశమ్యాలకు దూరంగా ఉండాలని ఆయన అన్నారు. ప్రపంచ శాంతి పై ఎప్పటికప్పుడు సాహిత్యాన్ని వెలువరించాలని వివిధ స్థాయిల్లో సమావేశాలను నిర్వహించి శాంతి సంఘీభావ పరిస్థితులను ప్రజలకు వివరించాలని వినోద్ కుమార్ నిర్వాహకులకు సూచించారు.జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న తాజా పరిణామాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి వాటిపై ప్రజలను చైతన్యం పరిచేందుకు విరివిగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని వినోద్ కుమార్ నిర్వాహకులకు సూచించారు.ఆహ్వాన సంఘం చైర్మన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ సంఘం జాతీయ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శులు అరుణ్ కుమార్, సుధాకర్ , హరి చంద్ సింగ్ భట్, సిపిఐ రాష్ట్ర నాయకులు పల్లా వెంకటరెడ్డి, సిపిఎం రాష్ట్ర నాయకులు జూలకంటి రంగారెడ్డి, ఆ సంఘం రాష్ట్ర నాయకులు బొమ్మగాని ప్రభాకర్ కె వి ఎల్ రఘుపాల్ తిప్పర్తి యాదయ్య జగన్మోహన్, వినోద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest