వరంగల్
శాస్త్ర సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులతో ఒక నూతన ఉరవడిక సాధించాలని సినీ నటుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. వరంగల్ నిట్ లో గురువారం ఏర్పాటుచేసిన స్ప్రింగ్ స్ప్రే 2023 ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మేధస్సుతో విద్యారంగంలో కొత్త ఉరవడికలు సృష్టించాలని అది మానవ మనుగడను అభివృద్ధి పరిచే విధంగా కొత్త కొత్త ఆలోచనలతో శాస్త్ర సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని ఆయన సూచించారు. ప్రపంచ దేశాల కంటే భారతదేశంలో భిన్న సంస్కృతులు వివిధ మతాలు వివిధ ప్రాంతాలు వారి జీవన విధానాలు సరైన మార్గదర్శకత కనుమరుగవుతున్న తరుణంలో విద్యా వైజ్ఞానిక పరిశోధనలతో కొత్త సృష్టించి అనేక మార్పులు తీసుకురావాలని ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. జాతీయ సాంకేతిక విద్యా విధానంలో నాటి నుండి నేటి వరకు ఎన్నో రూపాంతరాలుగా అవతరించిందని దానికి అనుగుణంగానే ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని వ్యాఖ్యానించారు. ఉన్నతమైన లక్ష్యాలు సాధించాలంటే ఒక ప్రణాళిక బద్ధంగా తమ నైపుణ్యాలను ఇతరులకు ఉపయోగపడే విధంగా రూపాంతరం చెందినప్పుడే సాధికారత సాధ్యమవుతుందని తెలిపారు. ఈ మూడు రోజులు జరిగే కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన విద్యార్థులు తమ కలలను ప్రదర్శించి ఉన్నత స్థాయిలో నిలిచి ఆదరాభిమానాలు పొందాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. విద్యార్థుల కేరింతలతో నిట్ వరంగల్ లో పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో నిట్ డైరెక్టర్ ఎన్వి రమణ రావు, స్టూడెంట్ డీన్ కోఆర్డినేటర్ పులి రవి కుమార్, స్టూడెంట్ కోఆర్డినేటర్, తదితరులు పాల్గొన్నారు.
