హైదరాబాద్, ఫిబ్రవరి 15 :
హాథ్ సే హాథ్ జోడో యాత్ర పై తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే సమీక్ష సమావేశం నిర్వహించారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం హథ్ సే హాథ్ జోడో యతలో ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి చేపట్టిన యాత్రకు స్పందన ఎలా ఉంది ? ఎంతవరకు వచ్చింది. ఎన్ని ప్రాంతాల్లో యాత్ర జరిగింది.? యాత్రలో ఎలాంటి సమస్యలు కాంగ్రెస్ పార్టీ దృష్టికి వచ్చాయి? కాంగ్రెస్ లో ఉన్న అగ్ర నాయకులూ ఎవరూ ఎందుకు యాత్రలో పాల్గొనలేదు వంటి అంశాలపై సమీక్ష చేసినట్టు తెలిసింది.
గాంధీ భవన్ లో జరిగిన ఈ సమావేశంలో హాథ్ సే హాథ్ జోడో అభియాన్ ఇంచార్జ్ గిరీష్ చోడొంకర్ ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, నదీమ్ జావిద్, వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. ఈ సందర్బంగా కొన్ని సూచనలు కూడా చేసినట్టు సమాచారం.
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కూడా …
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా కొద్దీ సేపు చర్చ జరిగినట్టు సమాచారం. తెలంగాణ లో హంగ్ రాబోతోంది. కాంగ్రెస్ , బి ఆర్ ఎస్ కలవబోతున్నారు అంటూ కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. దీంతో ఈ రోజు జరిగిన యాత్ర సమీక్ష సందర్బంగా కూడా కోమటి రెడ్డి వ్యాఖ్యలపై చర్చ జరిగినట్టు విశ్వసనీయ సమాచారం.