హైదరాబాద్‌లో కుండపోత వర్షం

హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. వాతావరణ శాఖ తాజా ప్రకటన ఏంటంటే..

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. సికింద్రాబాద్, ముషీరాబాద్, చిక్కడపల్లి‌లో వడగండ్ల వర్షం పడింది. హిమాయత్ నగర్, అంబర్ పేట, నల్లకుంట, రామంతపూర్ లో భారీ వర్షం కురిసింది. దిల్‌సుఖ్ నగర్, మలక్ పేట్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది.

రోడ్లన్నీ జలమయంకావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌, గచ్చిబౌలి, మణికొండ, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఎస్సార్‌నగర్‌, సికింద్రాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. మాసబ్‌ట్యాంక్, నాంపల్లి, లక్డికాపూల్‌, మాదాపూర్‌, హైటెక్ సిటీ, మెహిదీపట్నం, టోలీచౌకిలో భారీ ఉరుములతో కూడిన వర్షం వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. పలు జిల్లాల్లో వడగండ్లతో కూడిన వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. వర్షంలోనే హనుమాన్ శోభాయాత్ర కొనసాగుతోంది

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest