10వ తేదీన బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

హైదరాబాద్ :

ఈనెల 10వ తేదీ (ఎల్లుండి) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు  అధ్యక్షతన బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటి పార్టీ సహా, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరుగనున్నది.

ఈ విస్తృతస్థాయి సమావేశంలో .. పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసన సభ, శాసన మండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల పార్టీ అధ్యక్షులు , జిల్లా పరిషత్ చైర్మన్ లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ లు, డిసిఎమ్ఎస్, డి సి సి బి చైర్మన్ లు పాల్గొంటారు.

ఇది ఎన్నికల సంవత్సరమైన నేపథ్యంలో ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు,  పార్టీ కార్యకలాపాలు, తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు.ఆహ్వానితులు ప్రతీఒక్కరూ ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని అధినేత సిఎం కే సి ఆర్ తెలిపారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest