హైదరాబాద్
హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న సంఘ సంస్కర్త, భారత రాజ్యాంగ రూపశిల్పి డా.బి.ఆర్. అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం పనులు దాదాపు పూర్తయ్యాయి. రూ.150 కోట్లతో నిర్మిస్తున్న ఈ కాంస్య విగ్రహాన్ని డాక్టర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏప్రిల్ 14న సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. విగ్రహానికి సంబంధించిన డ్రోన్ వీడియోను మంత్రి హరీష్ రావు ట్విటర్లో షేర్ చేశారు.