పేదల దరిచేరని రాజ్యాంగ ఫలాలు :సురేందర్ సింగ్

 

  • ఇంకా పేదరికంలో మగ్గుతున్న గ్రామీణులు
  • కనీస సౌకర్యాలు కరువైన పాఠశాలలు
  • సామాజిక పరివర్తన యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన
  • సామాజిక పరివర్తన యాత్రలో పాల్గొన్న వారికి సన్మానం

హైదరాబాద్ , 01 అక్టోబర్ 2023 :

రాజ్యాంగంలోని ఫలాలు నేటికీ పేదల దరి చేరలేదని రాష్ట్రీయ మూల నివాస్ సంస్థ నిర్వాహకులు సురేందర్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం లోతుకుంటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన 29వ జ్ఞానమాల కార్యక్రమంలో బుద్ధిష్టి సొసైటీ సభ్యులు అనంతరాజుతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల వేశారు. ఈ సందర్భంగా జ్ఞానమాల కమిటీ సభ్యులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  సామాజిక పరివర్తన ద్వారానే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని రాజ్యాంగ పలాలు పేదవారికి ఇంకా అందటం లేదని తాము నిర్వహించిన సామాజిక పరివర్తన పాదయాత్రలో అనేక అంశాలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. మహనీయులైన అశోక చక్రవర్తి జ్యోతిబాపూలే , డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ , శివాజీ మహారాజ్, సాహూ మహారాజ్ ల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని బామ్ సేఫ్ తెలంగాణ శాఖ అధ్యక్షులు డాక్టర్ నాగేల్లి కుమార్ చెప్పారు. పది రోజులపాటు నిర్వహించిన సామాజిక పరివర్తన యాత్రలో ప్రజల నుంచి మంచి స్పందన ఉందని ఎక్కడికెళ్ళినా ప్రజా సమస్యలు తమ దృష్టికి వచ్చాయని నాయకులు తమ తమ ఓట్ల కోసమే ప్రయత్నాలు చేస్తున్నారని పేద వర్గాలను పట్టించుకోవటం లేదని కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బడుగు వర్గాల మేధావులందరూ తమ తమ జాతి చైతన్యానికి ముందుకు వచ్చి పరివర్తన యాత్ర చేయాలని అప్పుడే తమ హక్కులను సాధించుకోగలమని ఆయన స్పష్టం చేశారు. సామాజిక పరివర్తన యాత్ర అది ఒక యజ్ఞం లాంటిదని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సెప్టెంబర్ 10 నుండి 19 వరకు ఏడు మండలాలు 56 గ్రామాలు 155 కిలోమీటర్లు తొమ్మిది రోజులపాటు పర్యటన పూర్తిగా విజయవంతమైందని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి సామాజిక పరివర్తన యాత్ర నిర్వాహకుడు పి ఎల్ జి శంకర్ చెప్పారు. నాయకులు ఓట్ల కోసమే చూస్తున్నారని పేద ప్రజల అభివృద్ధి సంక్షేమ మరిచారని దానివల్లనే సమస్యలు ఎదురుగుతున్నాయని ఆయన వివరించారు . పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువైనయని విద్యార్థిని విద్యార్థులకు సరియైన భోజన సౌకర్యాలు లేవని గత ఆరు మాసాలుగా సంబంధిత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని తమ దృష్టికి వచ్చిందని ఆయన వివరించారు. మరోసారి రాజ్యాంగ రక్షణ కోసం గద్దర్ నిర్వహించిన సేవ్ కాన్స్టెన్సీ సేవ్ ఇండియా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, మెదక్ జిల్లాకు గద్దర్ పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. భారతదేశంలో మత స్వేచ్ఛ పేరిట ఎవరి దారి వారిదిగా వ్యవహరించడం వల్ల రాజ్యాంగాన్ని మర్చిపోతున్నారని వ్యక్తి స్వేచ్ఛను మత స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించిన హక్కుఅ ని
జ్ఞానమాల నిర్వహణ కమిటీ సభ్యులు సీనియర్ జర్నలిస్ట్ ఆస శ్రీరాములు చెప్పారు. అన్ని మత గ్రంధాలు కన్నా రాజ్యాంగం గొప్పదని ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ప లాలు దరిచేరె విధంగా బోధించవలసిన బాధ్యత అందరి పైన ఉందని చెప్పారు. పది రోజులు పాటు సామాజిక పరివర్తన యాత్ర నిర్వహించడం పట్ల ఆల్ ఇండియా గ్రామీణ బ్యాంక్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కేడి రమేష్ అభినందించారు. తర్వాత చేపట్టే కార్యక్రమాలు తమ వంతు భాగస్వామ్యం ఉంటుందని చెప్పారు. రాజ్యాంగపలాలు తెలుసుకో లేకపోవడం వల్లనే పేద వర్గాలు అభివృద్ధి చెందటం లేదని తమ తమ హక్కులు అధికారాలు తెలుసుకున్నప్పుడే ముందుకు సాగుతామని అణగారిన హక్కుల పోరాట సమితి కన్వీనర్ , గద్దర్ ప్రజా పార్టీ అధ్యక్షులు సిఎల్ యాదగిరి చెప్పారు. నేటి తరం యువతకు హక్కులు అధికారుల పైన చైతన్యం చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా సామాజిక పరివర్తన పాదయాత్రలో పాల్గొన్న రాష్ట్రీయ మూల నివాస్ అధ్యక్షులు సురేందర్ సింగ్ , బామ్ సేఫ్ తెలంగాణ శాఖ అధ్యక్షులు డాక్టర్ నాగేల్లి కుమార్ , దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి సామాజిక పరివర్తన యాత్ర నిర్వాహకులు పి ఎల్ జి శంకర్,
దాసరి ఏగొండ స్వామి , దుబాసి సంజీవ్, బ్యాగరి వేణు, పులి కల్పన లను జ్ఞానమాల నిర్వహణ కమిటీ తరఫున సన్మానించారు. కార్యక్రమంలో ఆసీస్ రాజ్ , అనంత రాజ్ , అస. శ్రవణ్ కుమార్ లు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest