హైదరాబాద్ :
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డా ఈ నెల 31న తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు.
సంగారెడ్డి లో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం సంగారెడ్డి లో జరిగే సభలో జేపీ నడ్డా ప్రసంగిస్తారు. దీంతో పాటు తెలంగాణ లో మరో రెండు జిల్లాల కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇతర నాయకులు కూడా హాజరవుతారు.