51 లక్షల 86 వేల 486 మంది కంటి పరీక్షలు

హైదరాబాద్, ఫిబ్రవరి 25:
• ముమ్మరంగా కొనసాగుతున్న ప్రిస్క్రిప్షన్ అద్దాల పంపిణీ
• 6,93,644 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల పంపిణీ కోసం రెఫర్
• రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 53 లక్షల 85 వేల 071 మందికి కంటి పరీక్షల నిర్వహణ
• 9 లక్షల 93 వేల 461 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ
• ఉచిత పరీక్షలతో ప్రజలకు తప్పుతున్న కంటి ఇబ్బందులు
• జిల్లా కలెక్టర్ ల పర్యవేక్షణలో ముమ్మరంగా కంటి వెలుగు శిబిరాల నిర్వహణ

 

హైదరాబాద్, ఫిబ్రవరి 25:

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ప్రజల జీవితాలలో కొత్త కాంతులు వస్తున్నాయి. కంటి సమస్యలతో బాధపడే వారి ఇబ్బందులను తొలగించేందు కు రాష్ట్ర ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించిన కంటి వెలుగు శిబిరాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు.
కంటి పరీక్షలు చేయించుకునేందుకు నగరాలు, పట్టణాలకు, ఆసుపత్రులకు వెళ్లే అవసరం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో జనావాసాల వద్ద కంటి వెలుగు శిబిరాలు నిర్వహించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలలో ఏర్పాటు చేస్తున్న కంటి వెలుగు క్యాంపులకు యువతీ, యువకుల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. వయస్సు నిమిత్తం లేకుండా కంటి వెలుగు క్యాంపులకు వచ్చి కంటిపరీక్షలు చేయించుకుంటున్నారు. కంటి వెలుగు క్యాంపుల నిర్వహణలో ప్రజాప్రతినిధులు, అధికారులు చురుకైన పాత్ర వహిస్తూ ప్రజలు కంటి వెలుగు క్యాంపుల వద్ద సకాలంలో చేరుకునే విధంగా ముందస్తుగా అవగాహన కల్పించి తమ వంతు సహాయ, సహకారాలు అందిస్తూ క్యాంపు విజయవంతానికి కృషి చేస్తున్నారు.
కంటి పరీక్షల నిర్వహణలో వచ్చే ఖర్చుకు భయపడో, అవగాహన లేక పరీక్షలు చేయించుకోని వారికి కంటి వెలుగు కార్యక్రమం ఒక వరంలా మారిందని, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలు అందించడంతో ప్రజలు సంబరపడుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 53 లక్షల 85 వేల 071 మంది ప్రజలకు 1500 వైద్య బృందాలతో కంటి పరీక్షలు నిర్వహించారు. 9 లక్షల 93 వేల 461 మంది ప్రజలకు రీడింగ్ గ్లాసులను అందజేసారు. 6 లక్షల 93 వేల 644 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు కోసం ఆర్డర్ చేశారు. కంటి వెలుగు శిబిరాలు 25 పని దినాలలో 53 లక్షల 85 వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించిన రీకార్డ్ రాష్ట్ర చరిత్రలో సరికొత్తది. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా చేపట్టాని ఒక బృహతర కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలలో ఉన్న బఫర్ బృందాలతో ఉద్యోగులకు, జర్నలిస్టులకు, పోలీసులకు, న్యాయవాదులకు, వివిధ వర్గాల వారికి ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

పెద్దపల్లి జిల్లా కంటి వెలుగు శిభిరాల్లో ప్రజల స్పందన….. వారి మాటల్లోనే….
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని శ్రీవాణి డిగ్రీ, పీజీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు క్యాంపుకు వచ్చిన కళషికం అనిత తన అభిప్రాయం తెలుపుతూ…
తనకు 40 సంవత్సరాలు అని, చూపు మసగ్గా, స్పష్టంగా లేనందున, సీఎం కేసీఆర్ సార్ కంటి వెలుగు శిబిరం ఏర్పాటు చేసారంటే వచ్చి పరీక్షలు చేయించుకున్న, ఇక్కడ డాక్టర్ సార్లు దూరం, దగ్గరి చూపును కండ్లకు పరీక్ష చేసి దగ్గర చూపు తగ్గిందని తెలిపారని, ఒక్క పైసా ఖర్చు లేకుండా ఉచితంగా కళ్లద్దాలు, మందులు క్యాంప్ లో ఇస్తున్నారని, ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం మాలాంటి వారికి చాలా ఉపయోగకరంగా ఉందని తెలిపారు.

షోహన్ బేగం మాట్లాడుతూ, తనకు (56) సంవత్సరాల వయస్సు అని, కంటి పరీక్షలపై అవగాహన లేక, వైద్య పరీక్షలకు వెళ్తే వేల రూపాయల ఖర్చు అవుతుందని భయపడిన మాకు, ఇంటికి పెద్ద కొడుకులాగ సి.ఎం. సార్ ఆలోచన చేస్తూ మేము ఉన్న ప్రాంతాల్లోనే కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేసి అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేస్తూ కళ్లద్దాలు, మందులు అందించడం చాలా సంతోషంగా ఉందని, సి.ఎం. సార్ చల్లగా ఉండాలని అన్నారు.

గర్రేపల్లికి చెందిన మట్టెల కొమురవెల్లి మాట్లాడుతూ, రోజు వారి పనుల ఒత్తిడిలో కంటి పరీక్షలు చేసుకునేందుకు పట్టణానికి వెళ్లి పరీక్షలు చేసుకోవాలని ఉండేదని, సమయం తీసి వెళ్ళుటకు తీరిక లేని సందర్భంలో ప్రభుత్వమే గ్రామీణ ప్రాంతాల్లో కంటి వెలుగు శిభిరం ఏర్పాటు చేయడం, నా లాంటి వారికి ఎంతో ఉపయోగకరమని, నేను కంటి పరీక్షలు చేయించుకొని పైసా ఖర్చు లేకుండా మందులు, కళ్లద్దాలు తీసుకొని ఇప్పుడు స్పష్టంగా చూడ గలుగుతున్నానని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ కంటి వెలుగు కార్యక్రమం తీసుకొని రావడం పై పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

స్వరూప
వొల్లాల సుగుణ
హనుమకొండ జిల్లా కంటి వెలుగు శిభిరాల్లో ప్రజల స్పందన….. వారి మాటల్లోనే….
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు శిబిరాలు హనుమకొండ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా 45 వైద్య బృందాల తో పాటు 2 బఫర్ బృందాలు సేవలు అందిస్తున్నాయి . ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా ఒక లక్షన్నర మందికి పైగా పరీక్షలు చేశారు. గ్రామాల్లో 208 , పట్టణ ప్రాంతాల్లో 75చోట్ల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 41వేల మందికి రీడింగ్ గ్లాస్ లను వైద్య శిబిరం లోనే అప్పటికప్పుడు అందించారు. వైద్య పరీక్షలు క్షుణ్ణం గా నిర్వహించిన అనంతరం దాదాపు 11 వేల మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు ను ఆర్డర్ చేసారు. హనుమకొండ కలెక్టరేట్ లో ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రేటర్ వరంగల్ జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్ లో ఐదు రోజుల పాటు, పోలీస్ లకోసం పోలీస్ కమిసనరేట్ కార్యాలయం లో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం అయ్యింది. జిల్లా వైద్య అధికారులు నిరంతరం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షస్తున్నారు.208గ్రామీణ ప్రాంతాలలో, 78పట్టణ ప్రాంతాలలో క్యాంపు లను ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం 5 గంటలకు వరకు నిర్వహిస్తున్నన్నారు. రోజుకి వంద నుండి రెండు వందల మందిని పరీక్షించునున్నారు.మరో వైపు వంద రోజులలో ప్రభుత్వ లక్ష్యన్ని సాధిస్తామని జిల్లా యంత్రాంగం ధీమా వ్యక్తం చేసింది.

రోజుకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కొన్ని వేల మందికి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా కంటి పరీక్షలు చేయడం అవసరమయ్యే అన్ని కేసులలో ఉచితంగా కళ్ళజోడు పంపిణీ చేస్తున్నారు. రెండోదశ కంటి వెలుగులో గతంలో కంటే ఎక్కువ కంటి పరీక్షలు నిర్వహించాలని అధికార యంత్రాంగం భావిస్తుంది. అందత్వంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని గుర్తించి,కంటి వెలుగులో చూపించుకునేలా కృషిచేయాలని మండల కార్యాలయాలు, గ్రామపంచాయతీ లు దోహదపడాలని, ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి గ్రామంలోని ఇంటి ఇంటికి వెళ్లి, అవగాహన కల్పించి కంటి వెలుగు శిబిరాలకి వచ్చేటట్టుగా చూడాలని, కరపత్రాలతో అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. అలాగే వైద్య సిబ్బంది,ఆశావర్కర్లు,ప్రజా ప్రతినిధులు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి శిబిరాల కు కంటి పరీక్షలతో బాధపడుతున్న వారిని తరలిస్తున్నారు.

ములుగు జిల్లాలో ప్రజల స్పందన…..
అద్దాలు పొందిన వారి మాటల్లో ఆనందం, చుక్కల మందులు ఇచ్చిండ్రు అద్దాలు ఇచ్చిండ్రు.
పెద్దల రమ వృత్తి కూలి , భర్త సాంబయ్య, శ్రీనివాస కాలనీ, ములుగు.
నా పేరు పెద్దల రమ. నాకు ముగ్గురు అమ్మాయిలే. కొడుకులు లేరు. పెద్ద బిడ్డ బీటెక్ చదువుతుంది. ఇద్దరు బిడ్డలు తాడువాయి లో ఇంటర్ చదువుతున్నారు. దగ్గర చూపు కనపడకపోయేది కంటి వెలుగు వల్ల కంటి పరీక్షలు చేయించుకుంటే ఉచితంగా చుక్కల మందులు ఇచ్చిండ్రు అద్దాలు ఇచ్చిండ్రు అద్దాలు మంచిగా కనబడుతున్నాయి. అద్దాలు పెట్టుకుంటే సూదిల దారం పెడుతున్న… ఈ కంటి వెలుగు మంచిగ అనిపించింది. ఉచితంగా కంటి అద్దాలు ఇచ్చారు.

గొల్లపల్లి స్వామి వృత్తి కూలీ…..
నేను బార్బర్ షాపులో పనిచేస్తా. మా ఊరు బండారుపల్లి. నాకు దగ్గర చూపు కనబడకపోయేది. ఇక్కడ కంటి వెలుగు పథకంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి అద్దాలు కూడా ఇస్తున్నారని చెప్పడంతో ఇక్కడికి వచ్చా. డాక్టర్లు కంటి పరీక్షలు చేసి, దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించి ఉచితంగా కళ్లద్దాలు ఇవ్వడంతో గతంలో కంటే ఇపుడు చూపు స్పష్టంగా కనిపిస్తున్నది.

ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపట్టింది. అచ్చ సాంబయ్య, తండ్రి లక్ష్మయ్య, బంజారా కాలనీ, ములుగు.
ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపట్టింది. ఉచితంగా కంటి పరీక్షలు చేసి అద్దాలు ఇవ్వడం చాలా సంతోషం. ప్రైవేటు దవఖానాలో ఐతే శానా పైసలు అయితుండే. ఈ కంటి వెలుగు లో మందులు, అద్దాలు ఉచితంగా ఇచ్చిండ్రు.

శేష్మ అచ్ఛా దిక్రా. మేరా నామ్ హశ్మత్, 53 వయసు గడిగడ్డ, ములుగు.

శేష్మ అచ్ఛా దిక్రా. నాకు ఇద్దరు కొడుకులు. ఇద్దరు బిడ్డలు. వాళ్ళ పెళ్లిళ్లు అయిపోయినాయి. నా భార్త చనిపోయాడు. నాకు కంటి సమస్య కొద్ది నెలల నుండి ఉంది. ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకోవడానికి డబ్బులు లేక చుపించుకోలేదు. కంటి వెలుగు కార్యక్రమము ప్రభుత్వం చేపట్టినదని చెప్పిండ్రు. ఉచితంగా మందులు ఇచ్చిండ్రు, అద్దాలు ఇచ్చిండ్రు. ఈ సర్కారు చల్లగా ఉండాలే. ఈ పథకంతో మాలాంటి పేదలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
కంటి వెలుగు సూపర్. కే. శ్రీనివాస్, వయసు 46 దేవగిరిపట్నం.
కంటి వెలుగు సూపర్. నాకు పేపర్ చదువుతుంటే దగ్గర చూపు ఇబ్బందిగా ఉండేది. కంటి వెలుగులో కంటి పరీక్షలు చేయించుకుంటే ఉచితంగా అద్దాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు సూపర్ గా కనబడుతున్నాయి. కేసీఆర్ పెట్టిన కంటి వెలుగు పథకంతో కొత్తచూపు వచ్చినట్లు ఉంది. ఇంకా ఇలాంటి పథకాలు కెసిఆర్ సారు మరెన్నో చేపట్టాలి.
కంటి వెలుగు గిట్లనే కొనసాగించాలే. హైమావతి వయసు 45 గొల్లవాడ ములుగు
నాకు కంటి వెలుగు కొత్త చూపునిస్తోంది. రూపాయి ఖర్చు లేకుండా కంటి పరీక్షలు చేసి మందులు, కళ్లద్దాలు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. కేసిఆర్ సారు కంటి వెలుగు గిట్లనే కొనసాగించాలే. ఏం డోకా లేదు ఇలలోని అందాలను మేము చూడగలం. పేదల కళ్ళలో అద్దాలు ఒక వరం.
కంటి వెలుగు కార్యక్రమము తో దురమౌతున్న కంటి సమస్యలు. జిల్లాలో కంటి వెలుగును సద్వినియోగం చేసుకుంటున్న ప్రజలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో దశ కంటి వెలుగు కార్యక్రమంలో ములుగు జిల్లా ప్రజలమాట ఇక ఏం డోకా లేదు. కంటి దగ్గర చూపు.. దూరం చూపు… ఇబ్బందిగా ఉండే మాకు కంటి అద్దాలు కంటి వెలుగులో ఇచ్చినవి. పెట్టుకుంటే అంత మంచిగా కనబడుతున్నాయని అంటున్నారు. జిల్లాలో అత్యధికంగా దగ్గరిచూపు కనిపించక ఇబ్బందిపడే వారే అధికంగా ఉన్నట్లు శిబిరాలలో నమోదవుతున్న లెక్కలు చెబుతున్నాయి. 40 ఏళ్ల వయస్సు పైబడిన చాలామందికి దగ్గర చూపు కనిపించడం లేదని శిబిరానికి వస్తున్నారు. ఇలాంటి వారికి తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించి, రీడింగ్ గ్లాసెస్ అందజేస్తున్నారు.

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు వైద్య శిబిరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 51 లక్షల 86 వేల 486 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి వెలుగు కార్యక్రమములో మొత్తం నేటి వరకు 9 లక్షల 65 వేల 249 మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది .
కంటి వెలుగు (23-02-2023)
* కంటి ప‌రీక్ష‌లు: 2,00,395 మంది
* రీడింగ్ గ్లాసెస్ పంపిణీ: 27,216
* ప్రిస్కిప్ష‌న్ గ్లాసెస్ కోసం రెఫ‌ర్‌: 20,824
* కంటి స‌మ‌స్య‌లు లేనివారు: 1,52,349 మంది

కంటివెలుగులో ఇప్ప‌టివ‌ర‌కు..
* మొత్తం కంటిప‌రీక్ష‌లు: 51,86,486 మంది
* మొత్తం రీడింగ్ గ్లాసెస్ పంపిణీ: 9,65,249
* మొత్తం ప్రిస్కిప్ష‌న్ గ్లాసెస్ కోసం రెఫ‌ర్‌: 6,72,276
* కంటి స‌మ‌స్య‌లు లేనివారు: 35,48,847 మంది.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest