6 నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర-ములుగు నుంచి షురూ

హైదరాబాద్

కాంగ్రెస్ పార్టీ దేశ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలు పెడుతున్నాడు. సోమవారం (6వ తేదీ) నుంచి హత్ సే హత్ జోడో అభియాన్ లో భాగంగా రేవంత్ పాదయాత్ర చేయనున్నారు. ఒకపక్క పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నా రేవంత్ రెడ్డి పాదయాత్రతోనే ఉంటారు. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు హైద్రాబాద్ లోని తన నివాసం నుంచి పాదయాత్రకు బయలు దేరుతారు. వరంగల్ హైవే మీదుగా ములుగుకు చేరుకుంటారు. 6వ తేదీ ఉదయం ములుగు లో గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన తరువాత అక్కడి నుంచి ఉదయం 11 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 12 గంటలకు పాదయాత్ర ప్రారంభం అవుతుంది. మేడారం నుంచి కొత్తూరు,నార్లాపుర్, ప్రాజెక్ట్ నగర్ వరకు పాదయాత్ర సాగుతుంది. మధ్యాహ్నం 2 నుంచి 2 30 వరకు ప్రాజెక్ట్ నగర్ లో భోజన విరామం తీరుకుంటారు. ప్రాజెక్ట్ నగర్ నుంచి మధ్యాహ్నం 2:30 గంటలకు పాదయాత్ర ప్రారంభం అవుతుంది. సాయంత్రం 4:30 నుంచి 5 గంటలకు పస్రా గ్రామంలో టీ విరామం ఉంటుంది.పస్రా జంక్షన్ లో సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం 6 గంకలకు పస్రా నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. రాత్రి 8 గంటలకు రామప్ప గ్రామానికి చేరుకుంటారు. రాత్రికి రామప్ప గ్రామంలో రేవంత్ రెడ్డి బస చేస్తారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest