సరూర్ నగర్
హైకోర్టుకు సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు లేఖ రాశారు. కాలేజీలో 700 మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటే అందరికీ ఒకే టాయిలెట్ ఉందని వారు లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై స్పందించిన హైకోర్టు.. సుమోటోగా కేసు విచారణకు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. సీఎస్, విద్యాశాఖ సెక్రెటరీ, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనర్‌కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.